MS Dhoni: ధోని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు రాకపోవడానికి కారణమదేనా..?
మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటింగ్ ఆర్డర్‌లో చివరల్లో వస్తూ మెరుపులు మెరిపిస్తున్నాడు. దీంతో ధోని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు రావాలన్న వాదన రోజు రోజుకు పెరుగుతోంది.

MS Dhoni
MS Dhoni: మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni) చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) బ్యాటింగ్ ఆర్డర్‌లో చివరల్లో వస్తూ మెరుపులు మెరిపిస్తున్నాడు. అయితే..ఈ సీజన్‌లో చెన్నై ప్రయాణం పడుతూ లేస్తూ అన్న విధంగా సాగుతోంది. ఇప్పటి వరకు తొమ్మిది మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో విజయం సాధించి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. చివరగా ఆడిన రెండు మ్యాచుల్లోనూ ఓడిపోయింది. ఇది ఇలాగే కొనసాగితే ప్లే ఆఫ్స్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి అనడంలో సందేహం లేదు.
చెన్నై ఓడిన చివరి రెండు మ్యాచుల్లో వేగంగా పరుగులు సాధించాల్సిన సమయంలో బ్యాటర్లు రాణించకపోవడంతో విజయావకాశాలు దెబ్బతిన్నాయి. సాధారణంగా అయితే ఇలాంటి సమయంలో ధోని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు వస్తుంటాడు. కాగా.. ఈ సీజన్‌లో అలాంటి ప్రయత్నమే చేయడం లేదు. పోనీ ధోని ఫామ్‌లో లేడా అంటే పుల్ పామ్‌లో ఉన్నాడు. ఆదివారం పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు బంతులు ఆడిన మహేంద్రుడు రెండు సిక్స్‌లు కొట్టి చెన్నై స్కోరును 200 పరుగుల మార్క్‌ను దాటించాడు.
IPL 2023, CSK vs PBKS: చెపాక్‌లో పంజాబ్‌దే విజయం.. ఉత్కంఠ పోరులో చెన్నైపై ఆఖరి బంతికి గెలుపు
అదే కారణమా..?
దీంతో ధోని బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందుకు రావాలన్న వాదన రోజు రోజుకు పెరుగుతోంది. అయితే.. మహేంద్రుడు బ్యాటింగ్ ఆర్డర్‌లో ముందు రాకపోవడానికి రెండు కారణాలు ఉన్నాయని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ధోని గాయంతో బాధపడుతున్నాడట. ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయడం కష్టం అని అంటున్నారు. దీంతో వికెట్ల మధ్య వేగంగా పరుగులు తీయలేకపోవడమే మొదటి కారణంగా చెబుతున్నారు.
ఇక రెండోది ధోని అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్‌మెంట్ అయ్యి దాదాపు మూడేళ్లు కావొస్తోంది. మ్యాచ్ ప్రాక్టీస్ లేకపోవడం, ఏజ్ మీద పడుతుండడంతో స్పిన్నర్లు ఎదుర్కొనడానికి కాస్త ఇబ్బందులు పడుతున్నాడు. స్పిన్ బౌలింగ్‌లో స్ట్రైక్‌ను రొటేట్ చేయలేకపోయిన పలు సందర్భాలు ఉన్నాయి. స్పిన్నర్లతో పోలిస్తే పేసర్లను ధోని ఉత్తమంగా ఎదుర్కొంటుండడం ఇంకో కారణంగా చెబుతున్నారు. అందుకనే రాయుడు, శివమ్ దూబే, జడేజాను ముందు పంపించి ఆఖర్లో ధోని వస్తున్నాడని అంటున్నారు.
MS Dhoni: అలా చెప్పడానికి సిగ్గు పడను.. హర్షా భోగ్లేతో ధోని ఆసక్తికర వ్యాఖ్యలు