World Cup 2023 IND vs AFG ODI : 8 వికెట్ల తేడాతో అఫ్గాన్ పై భారత్ గెలుపు
వన్డే ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.

World Cup 2023 IND vs AFG ODI
World Cup 2023 IND vs AFG : వన్డే ప్రపంచకప్‌లో భారత్ వరుసగా రెండో విజయాన్ని సాధించింది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది.
LIVE NEWS & UPDATES
-
273 పరుగుల లక్ష్యాన్ని 35 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ (131; 84 బంతుల్లో 16 ఫోర్లు, 5సిక్సర్లు) సూపర్ శతకంతో అఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. విరాట్ కోహ్లీ (55; 56 బంతుల్లో 6ఫోర్లు) హాప్ సెంచరీతో రాణించగా.. ఇషాన్ కిషన్ (47 ; 47 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) అర్థశతకాన్ని చేజార్చుకున్నాడు. అఫ్గానిస్థాన్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు.
-
రోహిత్ శర్మ క్లీన్ బౌల్డ్..
రోహిత్ శర్మ అద్భుత ఇన్నింగ్స్‌కు తెరపడింది. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో రోహిత్ (131; 84 బంతుల్లో 16 ఫోర్లు, 5సిక్సర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 25.4వ ఓవర్‌లో 205 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది.
-
25 ఓవర్లకు భారత స్కోరు 202/1
భారత ఇన్నింగ్స్‌లో సగం ఓవర్లు ముగిశాయి. 25 ఓవర్లకు భారత స్కోరు 202/1. విరాట్ కోహ్లీ (16), రోహిత్ శర్మ (130) లు ఆడుతున్నారు.
-
ఇషాన్ కిషన్ ఔట్
రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఇబ్రహీం జద్రాన్ క్యాచ్ అందుకోవడంతో ఇషాన్ కిషన్ (47 ; 47 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్సర్లు) ఔట్ అయ్యాడు. దీంతో 18.4 ఓవర్లలో 156 పరుగుల వద్ద భారత్ మొదటి వికెట్ కోల్పోయింది. 19 ఓవర్లకు టీమ్ఇండియ స్కోరు 158/1. విరాట్ కోహ్లీ (1), రోహిత్ శర్మ (103) లు ఆడుతున్నారు.
-
రోహిత్ శర్మ సెంచరీ
ఆసీస్‌తో జరిగిన మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయిన రోహిత్ శర్మ అఫ్గాన్‌తో జరుగుతున్న రెండో మ్యాచ్‌లో శతకంతో చెలరేగిపోయాడు. నబీ బౌలింగ్‌లో సింగిల్ తీసి 63 బంతుల్లో 12 ఫోర్లు, 1 సిక్స్‌తో శతకాన్ని అందుకున్నాడు.
Topping The Charts! ?
Most Hundreds (7️⃣) in ODI World Cups ? Rohit Sharma
Take a bow! ? #CWC23 | #TeamIndia | #INDvAFG | #MeninBlue pic.twitter.com/VlkIlXCwvA
— BCCI (@BCCI) October 11, 2023
-
15 ఓవర్లకు భారత స్కోరు 130/0
భారత ఇన్నింగ్స్‌లో మొదటి 15 ఓవర్లు పూర్తి అయ్యాయి. రోహిత్ దంచికొడుతుండడంతో భారత్ వికెట్ నష్టపోకుండా 130 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (92), ఇషాన్ కిషన్ (31) క్రీజులో ఉన్నారు.
-
10 ఓవర్లకు భారత స్కోరు 94/0
భారత ఇన్నింగ్స్‌లో మొదటి 10 ఓవర్లు పూర్తి అయ్యాయి. రోహిత్ దూకుడుగా ఆడుతుండడంతో భారత్ వికెట్ నష్టపోకుండా 94 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (76), ఇషాన్ కిషన్ (11) క్రీజులో ఉన్నారు.
-
రోహిత్ శర్మ హాఫ్ సెంచరీ
నవీన్ ఉల్ హక్ బౌలింగ్‌లో(7.4వ ఓవర్) ఫోర్ కొట్టిన రోహిత్ శర్మ 30 బంతుల్లో అర్థశతకాన్ని అందుకున్నాడు. కాగా వన్డేల్లో రోహిత్ కు ఇది 53వ అర్థశతకం
FIFTY for Rohit Sharma - his 5⃣3⃣rd in ODIs! ? ?
Talk about leading from the front! ? ?
Follow the match ▶️ https://t.co/f29c30au8u#CWC23 | #TeamIndia | #INDvAFG | #MeninBlue pic.twitter.com/rRV2SRucQJ
— BCCI (@BCCI) October 11, 2023
-
5 ఓవర్లకు భారత స్కోరు 37/0
ఓ మోస్తరు లక్ష్యాన్ని ఛేదించేందుకు ఓపెనర్లు రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్‌లు బరిలోకి దిగారు. రోహిత్ తనదైన శైలిలో బౌండరీలు బాదుతూ అఫ్గాన్ బౌలర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తుండగా మరో వైపు ఇషాన్ కిషన్ నిలదొక్కుకునేందుకు ప్రయత్నంలో ఉన్నాడు. 5 ఓవర్లకు భారత స్కోరు 37/0. రోహిత్ శర్మ (31), ఇషాన్ కిషన్ (5) లు ఆడుతున్నారు.
-
భారత లక్ష్యం 273
టాస్ గెలిచిన బ్యాటింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో హష్మతుల్లా షాహిదీ (80; 88 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్స్), అజ్మతుల్లా ఒమర్జాయ్ (62; 69 బంతుల్లో 2ఫోర్లు, 4 సిక్సర్లు) లు హాఫ్ సెంచరీలతో రాణించారు. భారత బౌలర్లలో బుమ్రా నాలుగు వికెట్లు తీయగా, హార్ధిక్ పాండ్య రెండు, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్‌లు చెరో వికెట్ పడగొట్టారు.
-
రషీద్ ఖాన్ ఔట్..
బుమ్రా బౌలింగ్‌లో కుల్దీప్ యాదవ్ క్యాచ్ అందుకోవడంతో రషీద్ ఖాన్ (16; 12బంతుల్లో 1ఫోర్, 1సిక్స్) ఔట్ అయ్యాడు. దీంతో 48.1వ ఓవర్‌లో 261 పరుగుల వద్ద అఫ్గానిస్థాన్ ఎనిమిదో వికెట్ కోల్పోయింది.
-
మహ్మద్ నబీ ఔట్..
బుమ్రా ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు పడగొట్టాడు. 45వ ఓవర్‌లో రెండో బంతికి నజీబుల్లాను ఔట్ చేసిన బుమ్రా ఆఖరి బంతికి మహ్మద్ నబీ (19; 27 బంతుల్లో 1ఫోర్) పెవిలియన్‌కు చేర్చాడు. 45 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు 235/7.
-
నజీబుల్లా ఔట్..
అఫ్గానిస్థాన్ మరో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో కోహ్లీ క్యాచ్ అందుకోవడంతో నజీబుల్లా(2) పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో అఫ్గానిస్థాన్ 44.2వ ఓవర్‌లో 229 పరుగుల వద్ద ఆరో వికెట్ కోల్పోయింది.
-
హష్మతుల్లా షాహిదీ ఔట్..
కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో హష్మతుల్లా షాహిదీ (80; 88 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్స్) ఎల్బీడబ్ల్యూగా ఔట్ అయ్యారు. దీంతో 42.4వ ఓవర్‌లో 225 పరుగుల వద్ద అఫ్గానిస్థాన్ ఐదో వికెట్ కోల్పోయింది.
-
40 ఓవర్లకు అఫ్గానిస్థాన్ స్కోరు 211/ 4
హష్మతుల్లా షాహిదీ దూకుడుగా ఆడుతున్నాడు. 40 ఓవర్లకు అఫ్గానిస్థాన్ స్కోరు 211/4. హష్మతుల్లా షాహిదీ (70), మహ్మద్ నబీ (9) లు క్రీజులో ఉన్నారు.
-
అజ్మతుల్లా ఒమర్జాయ్ ఔట్..
హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో అజ్మతుల్లా ఒమర్జాయ్ (62; 69 బంతుల్లో 2ఫోర్లు, 4 సిక్సర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 34.2వ ఓవర్‌లో 184 పరుగుల వద్ద అఫ్గానిస్థాన్ నాలుగో వికెట్ కోల్పోయింది.
-
అజ్మతుల్లా ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ
మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో (31.6వ ఓవర్)లో రెండు పరుగులు తీసి అజ్మతుల్లా ఒమర్జాయ్ 62 బంతుల్లో అర్థశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. 32 ఓవర్లకు అఫ్గానిస్థాన్ స్కోరు 161/3. అజ్మతుల్లా ఒమర్జాయ్ (50), హష్మతుల్లా షాహిదీ (45) లు ఆడుతున్నారు.
-
25 ఓవర్లకు అఫ్గానిస్థాన్ స్కోరు 114/3
అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్‌లో 25 ఓవర్లు పూర్తి అయ్యాయి. మూడు వికెట్లు కోల్పోయిన అఫ్గాన్ జట్టు 114 పరుగులు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (25), హష్మతుల్లా షాహిదీ (25)లు ఆడుతున్నారు.
-
20 ఓవర్లకు అఫ్గానిస్థాన్ స్కోరు 83/3
అఫ్గానిస్థాన్ ఇన్నింగ్స్‌లో 20 ఓవర్లు పూర్తి అయ్యాయి. మూడు వికెట్లు కోల్పోయిన అఫ్గాన్ జట్టు 83 పరుగులు చేసింది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (6), హష్మతుల్లా షాహిదీ (14)లు ఆడుతున్నారు.
-
రహ్మత్ షా ఔట్
శార్దూల్ ఠాకూర్ బౌలింగ్‌లో రహ్మత్ షా (16; 22 బంతుల్లో 3ఫోర్లు) ఎల్భీడబ్ల్యూగా పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో 13.1వ ఓవర్‌లో 63 పరుగుల వద్ద అఫ్గానిస్థాన్ మూడో వికెట్ కోల్పోయింది.
-
రహ్మానుల్లా గుర్బాజ్ ఔట్..
హార్దిక్ పాండ్య బౌలింగ్‌లో శార్దూల్ ఠాకూర్ క్యాచ్ అందుకోవడంతో రహ్మానుల్లా గుర్బాజ్ (21; 28 బంతుల్లో 3ఫోర్లు, 1సిక్స్) ఔట్ అయ్యాడు. దీంతో 12.4వ ఓవర్‌లో 63 పరుగుల వద్ద అఫ్గానిస్థాన్ రెండో వికెట్ కోల్పోయింది.
-
10 ఓవర్లకు అఫ్గానిస్థాన్ స్కోరు 48/1
అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో 10 ఓవర్లు ముగిశాయి. వికెట్ నష్టపోయిన అఫ్గానిస్థాన్ 48 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్(20), రహ్మత్ షా (4) లు ఆడుతున్నారు.
-
ఇబ్రహీం జద్రాన్ ఔట్
అఫ్గానిస్థాన్‌కు భారత పేసర్ బుమ్రా షాకిచ్చాడు. బుమ్రా బౌలింగ్‌లో ఇబ్రహీం జద్రాన్ (22; 28 బంతుల్లో 4 ఫోర్లు) కీపర్ కేఎల్ రాహుల్ క్యాచ్ అందుకోవడంతో ఔట్ అయ్యాడు. దీంతో 6.4వ ఓవర్‌లో 32 పరుగుల వద్ద అఫ్గానిస్థాన్ జట్టు మొదటి వికెట్ కోల్పోయింది.
-
5 ఓవర్లకు అఫ్గాన్ స్కోరు 19/0
అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో 5 ఓవర్లు పూర్తి అయ్యాయి. వికెట్ నష్టపోకుండా అఫ్గాన్ జట్టు 19 పరుగులు చేసింది. 5 ఓవర్లకు అఫ్గానిస్థాన్ స్కోరు 19 0. ఇబ్రహీం జద్రాన్ (17), రహ్మానుల్లా గుర్బాజ్(1)లు ఆడుతున్నారు.
-
3 ఓవర్లకు అఫ్గానిస్థాన్ స్కోరు 9/0
భారత బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేస్తున్నారు. దీంతో అఫ్గాన్ బ్యాటర్లు పరుగులు చేయడం కష్టంగా మారింది. 3 ఓవర్లకు అఫ్గానిస్థాన్ స్కోరు 9/0. ఇబ్రహీం జద్రాన్ (7), రహ్మానుల్లా గుర్బాజ్(1)లు ఆడుతున్నారు.
-
భారత తుది జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
? Toss & Team News ?
Afghanistan have elected to bat against the @ImRo45-led #TeamIndia!
1⃣ change in the line-up for India as Shardul Thakur is named in the team.
A look at our Playing XI ?
Follow the match ▶️ https://t.co/f29c30au8u #CWC23 | #INDvAFG | #MeninBlue pic.twitter.com/Vazk9Xon0q
— BCCI (@BCCI) October 11, 2023
-
అఫ్గానిస్థాన్ తుది జట్టు
రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహ్మత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), నజీబుల్లా జద్రాన్, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రహ్మాన్, నవీన్ ఉల్ హక్, ఫరూఖల్ హాక్
-
టాస్ గెలిచిన అఫ్గాన్..
అఫ్గాన్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో భారత్ మొదట ఫీల్డింగ్ చేయనుంది. ఈ మ్యాచ్‌లోనూ విజయం సాధించి ప్రపంచకప్‌లో విజయపరంపరను కొనసాగించాలని భారత్ భావిస్తోంది. భారత తుది జట్టులో ఓ మార్పు చోటు చేసుకుంది. రవిచంద్రన్ అశ్విన్ స్థానంలో శార్దూల్ ఠాకూర్ వచ్చాడు.