World Cup 2023 IND vs AUS ODI : ప్ర‌పంచ‌క‌ప్‌లో శుభారంభం చేసిన టీమ్ఇండియా.. ఆస్ట్రేలియాపై విజ‌యం

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్లు త‌ల‌ప‌డ్డాయి. టీమ్ఇండియా శుభారంభం చేసింది. చెన్నై వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో విజ‌యం సాధించింది.

World Cup 2023 IND vs AUS ODI : ప్ర‌పంచ‌క‌ప్‌లో శుభారంభం చేసిన టీమ్ఇండియా.. ఆస్ట్రేలియాపై విజ‌యం

pic @icc twitter

Updated On : October 8, 2023 / 9:51 PM IST

World Cup 2023 IND vs AUS : వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో టీమ్ఇండియా శుభారంభం చేసింది. చెన్నై వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో విజ‌యం సాధించింది.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 08 Oct 2023 09:52 PM (IST)

    గెలిచిన భార‌త్

    వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023లో టీమ్ఇండియా శుభారంభం చేసింది. చెన్నై వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజ‌యం సాధించింది.  200 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 41.2 ఓవ‌ర్ల‌లో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

  • 08 Oct 2023 09:35 PM (IST)

    విరాట్ కోహ్లీ ఔట్‌..

    టీమ్ఇండియా మ‌రో వికెట్ కోల్పోయింది. జోష్ హేజిల్ వుడ్ బౌలింగ్‌లో ల‌బుషేన్ క్యాచ్ అందుకోవ‌డంతో విరాట్ కోహ్లీ (85; 116 బంతుల్లో 6ఫోర్లు) ఔట్ అయ్యాడు. దీంతో భార‌త్ 37.4వ ఓవ‌ర్‌లో 167 ప‌రుగుల వ‌ద్ద నాలుగో వికెట్ కోల్పోయింది.

  • 08 Oct 2023 09:19 PM (IST)

    35 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 151/3

    భార‌త ఇన్నింగ్స్‌లో 35 ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. టీమ్ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 151 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లీ (80), కేఎల్ రాహుల్ (64) లు ఆడుతున్నారు.

  • 08 Oct 2023 08:50 PM (IST)

    30 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 120/3

    భార‌త ఇన్నింగ్స్‌లో 30 ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. టీమ్ఇండియా మూడు వికెట్లు కోల్పోయి 120 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లీ (60), కేఎల్ రాహుల్ (54) లు ఆడుతున్నారు.

  • 08 Oct 2023 08:36 PM (IST)

    కేఎల్ రాహుల్ హాఫ్ సెంచ‌రీ

    పాట్ క‌మిన్స్ బౌలింగ్‌లో (27.1వ ఓవ‌ర్‌)లో సింగిల్ తీసి 72 బంతుల్లో కేఎల్ రాహుల్ అర్థ‌శ‌త‌కాన్ని పూర్తి చేసుకున్నాడు. ఈ ఓవ‌ర్‌లో కోహ్లీ ఓ ఫోర్ కొట్ట‌డంతో మొత్తంగా 11 ప‌రుగులు వ‌చ్చాయి. 28 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 116 3. విరాట్ కోహ్లీ (59), కేఎల్ రాహుల్ (51) లు ఆడుతున్నారు.

  • 08 Oct 2023 08:29 PM (IST)

    విరాట్ కోహ్లీ హాఫ్ సెంచ‌రీ

    పాట్ క‌మిన్స్ బౌలింగ్‌లో (25.3వ ఓవ‌ర్‌) రెండు ప‌రుగులు తీసిన కోహ్లీ 75 బంతుల్లో అర్థ‌శ‌త‌కాన్ని అందుకున్నాడు. 26 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 100/3. క్రీజులో విరాట్ కోహ్లీ(50), కేఎల్ రాహుల్ (47) లు ఉన్నారు.

  • 08 Oct 2023 08:26 PM (IST)

    25 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 97/3

    భార‌త ఇన్నింగ్స్‌లో స‌గం ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. మూడు వికెట్ల న‌ష్టానికి 97 ప‌రుగులు చేసింది. క్రీజులో విరాట్ కోహ్లీ(48), కేఎల్ రాహుల్ (46) లు ఉన్నారు.

  • 08 Oct 2023 07:59 PM (IST)

    కేఎల్ రాహుల్ మూడు ఫోర్లు..

    18వ ఓవ‌ర్‌ను ఆడ‌మ్ జంపా వేయ‌గా కేఎల్ రాహుల్ మూడు ఫోర్లు కొట్టాడు. దీంతో ఈ ఓవ‌ర్‌లో మొత్తం 13 ప‌రుగులు వ‌చ్చాయి. 18 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 69/3. కేఎల్ రాహుల్ (32), విరాట్ కోహ్లీ (34) లు ఆడుతున్నారు.

  • 08 Oct 2023 07:43 PM (IST)

    15 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 49/3

    భార‌త ఇన్నింగ్స్‌లో మొద‌టి 15 ఓవ‌ర్లు ముగిశాయి. మూడు వికెట్ల కోల్పోయిన‌ టీమ్ఇండియా 49 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లీ (31), కేఎల్ రాహుల్ (15)లు ఆడుతున్నారు.

  • 08 Oct 2023 07:19 PM (IST)

    10 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 27/3

    భార‌త ఇన్నింగ్స్‌లో మొద‌టి 10 ఓవ‌ర్లు ముగిశాయి. మూడు వికెట్ల కోల్పోయిన‌ టీమ్ఇండియా 27 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లీ (17), కేఎల్ రాహుల్ (7)లు ఆడుతున్నారు.

  • 08 Oct 2023 07:00 PM (IST)

    5 ఓవ‌ర్ల‌కు భార‌త స్కోరు 12/3

    భార‌త ఇన్నింగ్స్‌లో మొద‌టి ఐదు ఓవ‌ర్లు ముగిశాయి. మూడు వికెట్ల న‌ష్టానికి టీమ్ఇండియా 12 ప‌రుగులు చేసింది. విరాట్ కోహ్లీ (5), కేఎల్ రాహుల్ (4)లు ఆడుతున్నారు.

  • 08 Oct 2023 06:42 PM (IST)

    ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీసిన హేజిల్‌వుడ్‌

    హేజిల్ వుడ్ ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీశాడు. రెండో ఓవ‌ర్ వేసిన హేజిల్‌వుడ్ మూడో బంతికి రోహిత్ శ‌ర్మ (0) ను ఎల్భీగా ఔట్ చేయ‌గా ఆరో బంతికి శ్రేయ‌స్ (0) ను పెవిలియ‌న్‌కు చేర్చాడు. దీంతో రెండు ప‌రుగుల‌కే మూడు వికెట్లు టీమ్ఇండియా కోల్పోయి క‌ష్టాల్లో ప‌డింది.

  • 08 Oct 2023 06:36 PM (IST)

    నాలుగో బంతికే ఇషాన్ కిష‌న్ ఔట్‌

    ఓ మోస్త‌రు ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు టీమ్ఇండియా ఓపెన‌ర్లు బ‌రిలోకి దిగారు. శుభ్‌మ‌న్ గిల్ అనారోగ్యంతో ఈ మ్యాచ్‌కు అందుబాటులోకి లేక‌పోవ‌డంతో అత‌డి స్థానంలో బ‌రిలోకి దిగిన ఇషాన్ కిష‌న్ (0) విఫ‌లం అయ్యాడు. మొద‌టి ఓవ‌ర్‌లోని నాలుగో బంతికే డ‌కౌట్ అయ్యాడు. స్టార్క్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్ చేతికి చిక్కాడు. 1 ఓవ‌ర్‌కు భార‌త స్కోరు 2/1. విరాట్ కోహ్లి (0), రోహిత్ శ‌ర్మ (0)లు ఆడుతున్నారు.

  • 08 Oct 2023 06:01 PM (IST)

    టీమ్ఇండియా టార్గెట్ 200

    టీమ్ఇండియా స్పిన్న‌ర్లు విజృంభించడంతో చెన్నై వేదిక‌గా జ‌రుగుతున్న మ్యాచులో ఆస్ట్రేలియా స్వ‌ల్ప స్కోరుకే ప‌రిమిత‌మైంది. 49.3 ఓవ‌ర్ల‌లో 199 ప‌రుగుల‌కు ఆలౌటైంది. ఆసీస్ బ్యాట‌ర్ల‌లో స్టీవ్ స్మిత్ (46; 71 బంతుల్లో 5 ఫోర్లు), డేవిడ్ వార్న‌ర్ (41; 52 బంతుల్లో 6 ఫోర్లు) లు రాణించారు. మిచెల్ మార్ష్‌(0), అలెక్స్ కేరీ (0), కామెరూన్ గ్రీన్ (8), మాక్స్‌వెల్ (15)లు విఫ‌లం అయ్యారు. భార‌త బౌల‌ర్ల‌లో ర‌వింద్ర జ‌డేజా మూడు వికెట్లు తీయ‌గా, బుమ్రా, కుల్దీప్ యాద‌వ్ లు చెరో రెండు, అశ్విన్, హార్దిక్ పాండ్య, మ‌హ్మ‌ద్ సిరాజ్‌లు త‌లా ఓ వికెట్ ప‌డ‌గొట్టారు.

  • 08 Oct 2023 05:23 PM (IST)

    క‌మిన్స్ ఔట్‌..

    ఆస్ట్రేలియా మ‌రో వికెట్ కోల్పోయింది. బుమ్రా బౌలింగ్‌లో శ్రేయ‌స్ అయ్య‌ర్ క్యాచ్ అందుకోవ‌డంతో క‌మిన్స్ (15; 24 బంతుల్లో 1ఫోర్‌, 1సిక్స్‌) ఔట్ అయ్యాడు. దీంతో 42.2వ ఓవ‌ర్‌లో 165 ప‌రుగుల వ‌ద్ద ఆస్ట్రేలియా ఎనిమిద‌వ వికెట్ కోల్పోయింది.

  • 08 Oct 2023 05:16 PM (IST)

    40 ఓవ‌ర్ల‌కు ఆసీస్ స్కోరు 156/7

    ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో 40 ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. 7 వికెట్లు కోల్పోయిన ఆసీస్ 156 ప‌రుగులు చేసింది. క్రీజులో క‌మిన్స్ (12), మిచెల్ స్టార్క్(4) లు ఉన్నారు.

  • 08 Oct 2023 05:01 PM (IST)

    కామెరూన్ గ్రీన్ ఔట్‌

    అశ్విన్ బౌలింగ్‌లో కామెరూన్ గ్రీన్ (8) హార్దిక్ పాండ్య క్యాచ్ అందుకోవ‌డంతో పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో ఆసీస్ 36.2వ ఓవ‌ర్‌లో 140 ప‌రుగుల వ‌ద్ద ఏడో వికెట్ కోల్పోయింది.

  • 08 Oct 2023 04:59 PM (IST)

    మాక్స్‌వెల్ క్లీన్ బౌల్డ్‌..

    ఆస్ట్రేలియా మ‌రో వికెట్ కోల్పోయింది. కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో మాక్స్ వెల్ (15; 25 బంతుల్లో 1 ఫోర్‌) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 35.5వ ఓవ‌ర్‌లో 140 ప‌రుగుల వ‌ద్ద ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది.

  • 08 Oct 2023 04:53 PM (IST)

    35 ఓవ‌ర్ల‌కు ఆసీస్ స్కోరు 138/5

    35 ఓవ‌ర్లు ముగిసే స‌రికి ఆస్ట్రేలియా 5 వికెట్లు కోల్పోయి 138 ప‌రుగులు చేసింది. క్రీజులో మాక్స్‌వెల్ (14), కామెరూన్ గ్రీన్ (7)లు ఉన్నారు.

  • 08 Oct 2023 04:29 PM (IST)

    ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీసిన జ‌డేజా

    జ‌డేజా ఒకే ఓవ‌ర్‌లో రెండు వికెట్లు తీశాడు. 30వ ఓవ‌ర్‌ను వేసిన జ‌డేజా రెండో బంతికి ల‌బుషేన్‌(27; 41 బంతుల్లో 1 ఫోర్‌) ఔట్ చేయ‌గా నాలుగో బంతికి అలెక్స్ కేరీ (0) ని డ‌కౌట్‌గా పెవిలియ‌న్‌కు చేర్చాడు. 30 ఓవ‌ర్ల‌కు ఆసీస్ స్కోరు 119/5. కామెరూన్ గ్రీన్ (0), మాక్స్ వెల్ (4) లు ఆడుతున్నారు.

  • 08 Oct 2023 04:12 PM (IST)

    స్టీవ్ స్మిత్ క్లీన్ బౌల్డ్‌..

    ఆస్ట్రేలియా మ‌రో వికెట్ కోల్పోయింది. జ‌డేజా బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్ (46; 71 బంతుల్లో 5 ఫోర్లు) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. దీంతో 27.1వ ఓవ‌ర్‌లో ఆసీస్ 110 ప‌రుగుల వ‌ద్ద మూడో వికెట్ కోల్పోయింది.

  • 08 Oct 2023 03:57 PM (IST)

    వంద దాటిన ఆసీస్ స్కోరు..

    ఆసీస్ ఇన్నింగ్స్‌లో 25 ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. రెండు వికెట్లు కోల్పోయి 102 ప‌రుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (43), ల‌బుషేన్ (17)లు ఆడుతున్నారు.

  • 08 Oct 2023 03:42 PM (IST)

    20 ఓవ‌ర్ల‌కు ఆసీస్ స్కోరు 85/2

    ఆసీస్ ఇన్నింగ్స్‌లో 20 ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. రెండు వికెట్లు కోల్పోయి 85 ప‌రుగులు చేసింది. స్టీవ్ స్మిత్ (36), ల‌బుషేన్ (8)లు ఆడుతున్నారు.

  • 08 Oct 2023 03:22 PM (IST)

    డేవిడ్ వార్న‌ర్ ఔట్‌..

    ఆస్ట్రేలియా మ‌రో వికెట్ కోల్పోయింది. డేవిడ్ వార్న‌ర్ (41; 52బంతుల్లో 6 ఫోర్లు) కుల్దీప్ యాద‌వ్ బౌలింగ్‌లో అత‌డికే క్యాచ్ ఇచ్చి పెవిలియ‌న్‌కు చేరుకున్నాడు. దీంతో 16.3వ ఓవ‌ర్‌లో 74 ప‌రుగుల వ‌ద్ద ఆసీస్ రెండో వికెట్ కోల్పోయింది.

  • 08 Oct 2023 03:16 PM (IST)

    15 ఓవ‌ర్ల‌కు ఆసీస్ స్కోరు 71/1

    ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మొద‌టి 15 ఓవ‌ర్లు ముగిశాయి. ఆసీస్ వికెట్ న‌ష్ట‌పోయి 71 ప‌రుగులు చేసింది. డేవిడ్ వార్న‌ర్ (40), స్టీవ్ స్మిత్ (31) అర్థ‌శ‌త‌క భాగ‌స్వామ్యాన్ని నిర్మించారు.

  • 08 Oct 2023 03:13 PM (IST)

    అర్థ‌శ‌త‌క భాగ‌స్వామ్యం

    ఇన్నింగ్స్ 13వ ఓవ‌ర్ ను కుల్దీప్ యాద‌వ్ వేశాడు. ఈ ఓవ‌ర్‌లో 5 ప‌రుగులు వ‌చ్చాయి. 13 ఓవ‌ర్ల‌కు ఆస్ట్రేలియా స్కోరు 59/1. డేవిడ్ వార్న‌ర్ (29), స్టీవ్ స్మిత్ (30) అర్థ‌శ‌త‌క భాగ‌స్వామ్యాన్ని నిర్మించారు.

  • 08 Oct 2023 02:56 PM (IST)

    వార్నర్‌ 1000 ప‌రుగులు

    వ‌న్డే ప్రపంచకప్‌లో వార్నర్ 1000 పరుగులు సాధించాడు. ఈ జాబితాలో చేరిన నాలుగో ఆస్ట్రేలియా ఆట‌గాడిగా రికార్డుల‌కు ఎక్కాడు.

  • 08 Oct 2023 02:55 PM (IST)

    10 ఓవ‌ర్ల‌కు ఆస్ట్రేలియా స్కోరు 43/1

    ఆస్ట్రేలియా బ్యాట‌ర్లు నిల‌క‌డ‌గా ఆడుతున్నారు. 10 ఓవ‌ర్ల‌కు ఆస్ట్రేలియా స్కోరు 43/1. డేవిడ్ వార్న‌ర్ (24), స్టీవ్ స్మిత్ (19)లు ఆడుతున్నారు.

  • 08 Oct 2023 02:41 PM (IST)

    13 ప‌రుగులు

    వార్న‌ర్ దూకుడుగా ఆడుతున్నాడు. హార్దిక్ పాండ్య వేసిన ఏడో ఓవ‌ర్‌లో రెండు ఫోర్లు కొట్టాడు. స్మిత్ ఓ ఫోర్ బాద‌డంతో ఈ ఓవ‌ర్‌లో మొత్తం 13 ప‌రుగులు వ‌చ్చాయి. 7 ఓవ‌ర్ల‌కు ఆసీస్ స్కోరు 29/1. డేవిడ్ వార్న‌ర్ (14), స్టీవ్ స్మిత్ (15)లు ఆడుతున్నారు.

  • 08 Oct 2023 02:36 PM (IST)

    అనిల్ కుంబ్లే రికార్డు బ్రేక్ చేసిన కోహ్లీ

    విరాట్ కోహ్లీ ఓ అరుదైన ఘ‌న‌త‌ను అందుకున్నాడు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో టీమ్ఇండియా త‌రుపున అత్య‌ధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డ‌ర్‌(నాన్ వికెట్ కీప‌ర్‌)గా రికార్డుల్లోకి ఎక్కాడు. ఈ క్ర‌మంలో అనిల్ కుంబ్లే రికార్డును బ్రేక్ చేశాడు.

    విరాట్ కోహ్లీ -15
    అనిల్ కుంబ్లే - 14
    క‌పిల్ దేవ్ - 12
    స‌చిన్ టెండూల్క‌ర్ -12 క్యాచ్‌ల‌ను అందుకున్నారు.

     

  • 08 Oct 2023 02:25 PM (IST)

    5 ఓవ‌ర్ల‌కు ఆసీస్ స్కోరు 16/1.

    ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌లో మొద‌టి 5 ఓవ‌ర్లు పూర్తి అయ్యాయి. వికెట్ న‌ష్టానికి ఆస్ట్రేలియా 16 ప‌రుగులు చేసింది. డేవిడ్ వార్న‌ర్ (5), స్టీవ్ స్మిత్ (11) లు ఆడుతున్నారు.

  • 08 Oct 2023 02:13 PM (IST)

    మిచెల్ మార్ష్ డ‌కౌట్‌

    బుమ్రా బౌలింగ్‌లో విరాట్ కోహ్లీ క్యాచ్ అందుకోవ‌డంతో మిచెల్ మార్ష్ (0) డ‌కౌట్ అయ్యాడు. దీంతో ఆస్ట్రేలియా 2.2వ ఓవ‌ర్‌లో 5 ప‌రుగుల వ‌ద్ద మొద‌టి వికెట్ కోల్పోయింది.

  • 08 Oct 2023 02:10 PM (IST)

    వార్న‌ర్ ఫోర్‌

    రెండో ఓవ‌ర్‌ను సిరాజ్ వేయ‌గా తొలి బంతికే వార్న‌ర్ ఫోర్ కొట్టాడు. మిగిలిన ఐదు బంతుల‌ను సిరాజ్ క‌ట్టుదిట్టంగా వేయ‌డంతో ప‌రుగులు రాలేదు.2 ఓవ‌ర్లకు ఆస్ట్రేలియా స్కోరు 5/0. డేవిడ్ వార్న‌ర్ (5), మిచెల్ మార్ష్ (0) లు ఆడుతున్నారు.

  • 08 Oct 2023 02:07 PM (IST)

    మొద‌టి ఓవ‌ర్‌లో ఒక్క ప‌రుగే..

    టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెన‌ర్లుగా డేవిడ్ వార్న‌ర్‌, మిచెల్ మార్ష్ లు వ‌చ్చారు. జ‌స్‌ప్రీత్ బుమ్రా మొద‌టి ఓవ‌ర్‌ను వేశాడు. క‌ట్టుదిట్టంగా బంతులు వేయ‌డంతో ఈ ఓవ‌ర్‌లో ఒక్క ప‌రుగు మాత్ర‌మే వ‌చ్చింది. 1 ఓవ‌ర్‌కు ఆస్ట్రేలియా స్కోరు 1/0. డేవిడ్ వార్న‌ర్ (1), మిచెల్ మార్ష్ (0) లు ఆడుతున్నారు.

  • 08 Oct 2023 01:51 PM (IST)

    భారత తుది జ‌ట్టు

    రోహిత్ శర్మ (కెప్టెన్‌), ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్‌ రాహుల్ (వికెట్ కీప‌ర్‌), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

  • 08 Oct 2023 01:51 PM (IST)

    ఆస్ట్రేలియా తుది జ‌ట్లు

    డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, మార్నస్ లాబుషాగ్నే, గ్లెన్ మాక్స్‌వెల్, అలెక్స్ కారీ(వికెట్ కీప‌ర్‌), కామెరాన్ గ్రీన్, పాట్ కమిన్స్(కెప్టెన్‌), మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

  • 08 Oct 2023 01:51 PM (IST)

    టాస్ గెలిచిన ఆసీస్‌

    టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో టీమ్ఇండియా ల‌క్ష్యాన్ని ఛేదించాల్సి ఉంటుంది. భార‌త ఓపెన‌ర్ శుభ్‌మ‌న్ గిల్ అనారోగ్యం కార‌ణంగా ఈ మ్యాచ్‌కు దూరం అయ్యాడు. అత‌డి స్థానంలో ఇషాన్ కిష‌న్ జ‌ట్టులోకి వ‌చ్చాడు.