Instagram Location Feature : ఇన్‌స్టాగ్రామ్‌లో వాట్సాప్ మాదిరి లొకేషన్ షేరింగ్ ఫీచర్‌.. ఇదేలా పని చేస్తుందంటే?

Instagram Location Feature : వినియోగదారులు తమ లైవ్ లొకేషన్‌ను ఒక గంట వరకు షేర్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్ (DM)లో లొకేటింగ్ షేరింగ్ ఫీచర్‌ను అందిస్తుంది.

Instagram Location Feature : ఇన్‌స్టాగ్రామ్‌లో వాట్సాప్ మాదిరి లొకేషన్ షేరింగ్ ఫీచర్‌.. ఇదేలా పని చేస్తుందంటే?

Instagram Location Feature

Updated On : November 27, 2024 / 12:16 AM IST

Instagram Location Feature : ఇన్‌స్టాగ్రామ్ కొత్త లొకేషన్ షేరింగ్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. వినియోగదారులు తమ లైవ్ లొకేషన్‌ను ఒక గంట పాటు షేర్ చేయడం లేదా మ్యాప్‌లో తమ లొకేషన్‌ను పిన్ చేసేందుకు అనుమతిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ డైరెక్ట్ మెసేజ్ (DM)లో లొకేటింగ్ షేరింగ్ ఫీచర్‌ను అందిస్తుంది.

వినియోగదారులు తమ లైవ్ లొకేషన్‌ను ఒక గంట వరకు షేర్ చేసేందుకు అనుమతిస్తుంది. అంతేకాదు.. రాక సమయాలను కోఆర్డినేట్ చేయడం లేదా కచేరీలు లేదా క్రికెట్ మ్యాచ్‌లు వంటి రద్దీ ప్రదేశాలలో మీ స్నేహితుల లొకేషన్ గుర్తించేందుకు మ్యాప్‌లో ఒక లొకేషన్ పిన్ చేయడానికి కూడా ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా, లైవ్ లొకేషన్ ఫీచర్ డిఫాల్ట్‌గా ఆఫ్ అవుతుంది. డైరెక్ట్ మెసేజ్‌లో ప్రైవేట్‌గా మాత్రమే షేర్ అవుతుంది. షేరింగ్ లొకేషన్ చాట్‌లోని రెండు పార్టీలకు కనిపిస్తుంది. మరెవరికీ ఫార్వార్డ్ చేయడం కుదరదు. ఇన్‌స్టాగ్రామ్ లైవ్ లొకేషన్ షేరింగ్ ప్రోగ్రెస్‌లో ఉందని సూచించే చాట్ ఎగువన ఒక ఇండికేషన్ కూడా కనిపిస్తుంది. వినియోగదారులు తమకు నచ్చిన సమయంలో లొకేషన్ షేరింగ్‌ను ఎండ్ చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. మెటా యాజమాన్యంలోని సోషల్ మీడియా దిగ్గజం లొకేషన్ షేరింగ్ ఫీచర్‌లు ప్రస్తుతం ఎంపిక చేసిన దేశాలలో మాత్రమే అందుబాటులో ఉన్నాయని పేర్కొంది.

డీఎమ్ నిక్ నేమ్స్ :
చాట్‌లో పాల్గొన్న రెండు పార్టీలకు డీఎమ్ అంతటా నిక్ నేమ్స్ యాడ్ చేసే ఆప్షన్‌ను ఇన్‌స్టాగ్రామ్ అందిస్తుంది. అయితే, ఇక్కడ మార్చిన పేరు డీఎమ్ చాట్‌లలో మాత్రమే వర్తిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో మరెక్కడా యూజర్ నేమ్ మార్చదు. వినియోగదారు ఫాలో అయ్యే వ్యక్తులందరూ డిఫాల్ట్‌గా తమ నిక్ నేమ్ మార్చుకోగలిగినప్పటికీ, చాట్‌లో నిక్ నేమ్ ఎవరు మార్చవచ్చో కంట్రోల్ చేసే ఫీచర్ అందిస్తుంది.

డైరెక్ట్ మెసేజ్ (DM)లో నిక్ నేమ్ క్రియేట్ చేసేందుకు ఒకరు చాట్ పేరు పైన ట్యాప్ చేసి.. ఆపై నిక్ నేమ్స్ పై క్లిక్ చేయాలి. ఆ చాట్ కోసం వారు కేటాయించాలనుకుంటున్న పేరును యాడ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ 17 కొత్త స్టిక్కర్ ప్యాక్‌లు డీఎమ్‌లకు వస్తున్నట్లు ప్రకటించింది. సరైన రియాక్షన్ కనుగొనడానికి వినియోగదారులకు మరిన్ని ఆప్షన్లను అందిస్తుంది. చాట్ నుంచి స్టిక్కర్‌ను ఇష్టపడే ఆప్షన్ కూడా ఉంటుంది. తద్వారా తరువాత కన్వర్జేషన్ సజావుగా కొనసాగించవచ్చు.

Read Also : iPhone 17 Pro Models : స్పెషల్ కెమెరా ఫీచర్లతో రానున్న ఆపిల్ ఐఫోన్ 17 ప్రో మోడల్స్.. ఇంకా ఏమి ఉండొచ్చుంటే?