మే.. లోనే లాంచ్ : శాంసంగ్ నుంచి మడతబెట్టే ఫోన్

ప్రముఖ సౌత్ కొరియన్ మొబైల్ దిగ్గజం శాంసంగ్ నుంచి ఫస్ట్ ఫొల్డబుల్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. మే నెల రెండో వారంలో అధికారికంగా శాంసంగ్ ‘గెలాక్సీ ఫోల్డ్’లాంచ్ కానుంది.

  • Published By: sreehari ,Published On : April 18, 2019 / 09:49 AM IST
మే.. లోనే లాంచ్ : శాంసంగ్ నుంచి మడతబెట్టే ఫోన్

ప్రముఖ సౌత్ కొరియన్ మొబైల్ దిగ్గజం శాంసంగ్ నుంచి ఫస్ట్ ఫొల్డబుల్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. మే నెల రెండో వారంలో అధికారికంగా శాంసంగ్ ‘గెలాక్సీ ఫోల్డ్’లాంచ్ కానుంది.

ప్రముఖ సౌత్ కొరియన్ మొబైల్ దిగ్గజం శాంసంగ్ నుంచి ఫస్ట్ ఫొల్డబుల్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది. మే నెల రెండో వారంలో అధికారికంగా శాంసంగ్ ‘గెలాక్సీ ఫోల్డ్’లాంచ్ కానుంది. మేలో ఏ తేదీలో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల చేస్తారనేదానిపై కంపెనీ ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

మొబైల్ మార్కెట్లో ఇప్పటికే గెలాక్సీ సిరీస్ లను రిలీజ్ చేసిన కంపెనీ.. ఈ సరికొత్త మడతబెట్టే స్మార్ట్ ఫోన్ ను శాంసంగ్ యూజర్ల కోసం అందుబాటులోకి తీసుకోస్తోంది. ఈ కొత్త ఫోన్ రిలీజ్ పై సంస్థ సీఈ, ప్రెసిడెంట్ DJ కోహ్ ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ధ్రువీకరించారు. ఇటీవలే గెలాక్సీ ఎ70 సిరీస్ ను రిలీజ్ చేసిన శాంసంగ్ గెలాక్సీ ఎ80 సిరీస్ ను కూడా అదే రోజున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు. 
Also Read : వింతల్లో వింత : 8 ఏళ్ల బాలుడి కడుపులో పిండం.. డాక్టర్లు షాక్

ఈ ఫోల్డబుల్ ఫోన్ ఇప్పటికే యూఎస్ లో రిలీజ్ కాగా.. సేల్స్ కు సంబంధించి ప్రీ ఆర్డర్లు మొదలయ్యాయి. ఈ మడతబెట్టే స్మార్ట్ ఫోన్ లో ప్రత్యేక ఆకర్షణ.. రెండు స్ర్రీన్లు. ఓపెన్ చేస్తే.. అచ్చం ట్యాబ్లెట్ డివైజ్ లా కనిపిస్తుంది. మడతబెడితే స్మార్ట్ ఫోన్ సైజులోకి మారిపోతుంది. రెండు రకాలుగా వాడుకోవచ్చు. ఇదే మొబైల్ యూజర్లను ఎట్రాక్ట్ చేయనుంది.

శాంసంగ్ రిలీజ్ చేసే ఈ మడతబెట్టే స్మార్ట్ ఫోన్ ధర లక్షల్లోనే. వెరీ కాస్ట్. యూఎస్ లో ఈ ఫోన్ ధర 1,980 డాలర్లు ఇండియాలో (రూ.1 లక్ష 41వేలు). ఏప్రిల్ 26 నుంచి USలో ఈ ఫోల్డబుల్ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. యూఎస్ లో లాంచ్ అయిన ఈ గెలాక్సీ ఫోల్డ్ లో డిసిప్లే ఇష్యూ ఉన్నట్టు కనిపిస్తోంది. 

స్పెషిఫికేషన్లు, ఫీచర్లు ఇవే.. 
* డ్యుయల్ డిసిప్లే, 6 కెమెరాలు  
* ఔట్ సైడ్ డిసిప్లే 4.6 అంగుళాల HD+ సూపర్ AMOLED డిసిప్లే (రేషియో 21:9)
* సెకండ్ డిసిప్లే 7.3 అంగుళాలు QXGA+ డైనమిక్ AMOLED డిసిప్లే (రేషియో 4:2:3)
* ఇన్ఫినిటీ ఫ్లెక్స్ డిసిప్లే, 7nm క్వాల్ కామ్న్ స్నాప్ డ్రాగన్ 855 ఆక్టా కోర్ Soc
* 12GB ర్యామ్, 512GB ఇంటర్నల్ స్టోరేజీ 
* మైక్రో SD కార్డు స్లాట్ (లేదు)
* 10 మెగా ఫిక్సల్ సెల్ఫీ కెమెరా (ఫోల్డ్ చేస్తే) ఔట్ సైడ్
* బ్యాక్ సైడ్ : ట్రిపుల్ కెమెరా, 12మెగా ఫిక్సల్ వైడ్ యాంగిల్ లెన్స్
* 12 మెగా ఫిక్సల్ సెన్సార్ టెలిఫోటో లెన్స్ 
* 16 మెగా ఫికల్స్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్
* ఫోల్డ్ ఓపెన్ : రెండు కెమెరాలు, 10MP సెన్సార్, 8MP డెప్త్ సెన్సార్
* రెండు బ్యాటరీలు 4,380mAH
* ఫాస్ట్ వైర్ ఛార్జింగ్, వైర్ లెస్ ఛార్జింగ్