బీటా వర్షన్ : వాట్సాప్ కొత్త ఫీచర్.. ఎంత వాడారో చెప్పేస్తుంది

ఎప్పడికప్పుడూ కొత్త ఫీచర్ అప్ డేట్స్ రిలీజ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్న ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ మరో కొత్త అప్ డేట్ తో ముందుకు రానుంది వాట్సాప్ సెట్టింగ్స్ ను రీడిజైన్ చేస్తోంది.

  • Published By: sreehari ,Published On : February 13, 2019 / 01:16 PM IST
బీటా వర్షన్ : వాట్సాప్ కొత్త ఫీచర్.. ఎంత వాడారో చెప్పేస్తుంది

ఎప్పడికప్పుడూ కొత్త ఫీచర్ అప్ డేట్స్ రిలీజ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్న ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ మరో కొత్త అప్ డేట్ తో ముందుకు రానుంది వాట్సాప్ సెట్టింగ్స్ ను రీడిజైన్ చేస్తోంది.

ఎప్పడికప్పుడూ కొత్త ఫీచర్ అప్ డేట్స్ రిలీజ్ చేస్తూ యూజర్లను ఆకట్టుకుంటున్న ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ మరో కొత్త అప్ డేట్ ను రిలీజ్ చేయనుంది. వాట్సాప్ సెట్టింగ్స్ ను రీడిజైన్ చేస్తోంది. వాట్సాప్ లేటెస్ట్ బీటా వెర్షన్ ఆండ్రాయిడ్ v2.19.4 లో సెట్టింగ్స్ మెనూ రీడిజైన్ తో రానుంది. వాట్పాప్ బీటా వర్షన్ పై ఈ కొత్త ఫీచర్ టెస్టింగ్ దశలో ఉన్నట్టు డబ్ల్యూఏబీటా ఇన్ఫో పేర్కొంది.

అదే నిజమైతే.. త్వరలో గూగుల్ ప్లే స్టోర్ లో వాట్సాప్ కొత్త అప్ డేట్ సెట్టింగ్స్ రీడిజైన్ ఫీచర్ అందుబాటులోకి వచ్చినట్టే. ఈ కొత్త డిజైన్ సెట్టింగ్స్ మెనూలో సరికొత్తగా.. యూజర్ స్టాట్స్ డేటాతో కలిపి అన్నీ సెక్షన్లలో స్పష్టమైన లుక్ కనిపించనుంది. ఈ ఫీచర్ లో కొత్త ఐకాన్లు కూడా చూడొచ్చు. 

వైట్ బ్యాక్ గ్రౌండ్.. డార్క్ సెట్టింగ్ ఆప్షన్..
గమనించాల్సిన విషయం ఏమిటంటే.. Settings menu బ్యాక్ గ్రౌండ్ అంతా వైట్ కలర్ తో నిండి ఉంటుంది. మీరు కావాలనుకుంటే.. డార్క్ మోడ్ కూడా సెట్ చేసుకోవచ్చు. Redesign setting (రీడిజైన్ సెట్టింగ్స్) మెనూలో.. నెట్ వర్క్ సెక్షన్ లో డేటా ఎంత వాడామో.. మొత్తం ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. వాట్సాప్ లో ఎంత డేటా వాడాము.. ఎన్ని మెసేజ్ లు పంపాము.. ఎన్ని రిసీవ్ చేసుకున్నాం ఇలా మొత్తం డేటా చూడొచ్చు.

నెట్ వర్క్ యూసేజ్ మెనూలో ఒక్కో సెక్షన్ ను డివైడ్ చేయగా.. కాల్స్, మీడియా, గూగుల్ డ్రైవ్, మెసేజ్ లు, స్టేటస్ కనిపిస్తుంది. దీంతో పాటు ఇప్పటివరకూ ఎంత డేటా వాడారో కూడా ఇక్కడే తెలుసుకోవచ్చు. రీడిజైన్ సెట్టింగ్స్ లో యూజర్ ఇంటర్ ఫేస్ (UI)ఆధారంగా మొత్తం ఎన్ని మెసేజ్ లు పంపించుకున్నారో తెలిసిపోతుంది. ఫొటోలు, వీడియోలు, జిఫ్ ఇమేజ్ లు ఇలా ఎన్నో పంపారో, ఎన్నిసార్లు సెండ్ చేసారో తెలిసిపోతుంది. 
WhatsApp to get new Upadate in Redesigned Settings Menu With Usage Stats

Also Read: పబ్‌జీకు మించిన గేమ్ వచ్చేసింది..

Also Read: ఐఫోన్‌లో కొత్త ఫీచర్.. మీ కారుకు ఫుల్ సెక్యూరిటీ

Also Read: ఊరట : ఛానళ్ల సెలక్షన్ మరో రెండు నెలలు