London : లండన్‌లో హైదరాబాద్ యువతి హత్య ..

ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన హైదరాబాద్ కు చెందిన 27 ఏళ్ల తేజస్విని హత్యకు గురైంది. బ్రెజిల్ కు చెందిన ఓ యువకుడు కత్తితో దాడి చేసి హత్య చేశాడు.

London : లండన్‌లో హైదరాబాద్ యువతి హత్య ..

Kontham Tejaswini

Updated On : June 14, 2023 / 5:55 PM IST

Kontham Tejaswini assassinated In London : చదువుకోవటానికి యూకే వెళ్లిన తెలుగు యువతి హత్యకు గురయ్యింది. ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లిన హైదరాబాద్ కు చెందిన 27 ఏళ్ల తేజస్విని అనే యువతి హత్యకు గురైంది. మంగళవారం (జూన్13,2023) ఉదయం 10గంటల సమయంలో వెంబ్లీలోని నీల్డ్ క్రెసెంట్ ప్రాంతంలో బ్రెజిల్ కు చెందిన ఓ యువకుడు ఆమెను కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కొంతం తేజస్విని అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దాడిలో 28 ఏళ్ల మరో యువతి తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్సపొందుతోంది.

హైదరాబాద్ చంపాపేట్ కు చెందిన తేజస్విని 2022లో మాస్టర్స్ చేయటానికి లండన్ కు వెళ్లింది. తేజస్వినితో పాటు ఈ దాడిలో గాయపడిన మరో యువతి ఇద్దరు యూనివర్శిటీ ఆఫ్ నాటింగ్ హామ్ లో చదువుతున్నారు. నిందితుడిని లండన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

హత్యా స్థలంలో ఉన్న 24 ఏళ్ల యువకుడితో పాటు మరో 23 ఏళ్ల యువతిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కానీ ఆ తరువాత కాసేపటికే యువతిని పోలీసులు విడిచిపెట్టారు. తేజస్విని తన స్నేహితులతో కలిసి నివసించే అపార్టుమెంట్ లోకి వారం క్రితం సదరు నిందితుడు షిఫ్టు అయ్యాడని పోలీసులు తెలిపారు.