Corona Cases Telangana : తెలంగాణలో ఒక్కరోజులోనే 5,567 కరోనా కేసులు, 23 మంది మృతి

తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఒక్కరోజులో 5 వేల 567 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Corona Cases Telangana : తెలంగాణలో ఒక్కరోజులోనే 5,567 కరోనా కేసులు, 23 మంది మృతి

5567 Corona Positive Cases In A Single Day In Telangana

Updated On : April 22, 2021 / 1:50 PM IST

corona cases In Telangana : తెలంగాణలో కరోనా ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. ఒక్కరోజులో 5 వేల 567 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అటు కరోనాతో చనిపోతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. 24 గంటల్లో కరోనాతో 23 మంది మరణించారు.

ఇక జీహెచ్‌ఎంసీ పరిధిలో కరోనా వీరవిహరం చేస్తోంది. ఒక్క గ్రేటర్‌లోనే 24గంటల్లో 989 కేసులు నమోదయ్యాయి. పెరుగుతున్న కేసులను బట్టి చూస్తుంటే హైదరాబాద్‌లో ప్రజల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది.

అటు మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాలోనూ 400 పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇక రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 49 వేల 781కి చేరింది.