ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, చర్చకు సిద్ధమా?- మంత్రి ఉత్తమ్‌కు బీజేపీ ఎమ్మెల్యే సవాల్

R టాక్స్, B టాక్స్ గురించి మాట్లాడినప్పుడు సైలెంట్ గా కూర్చున్న ఉత్తమ్.. U టాక్స్ అన్నప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు?

ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా, చర్చకు సిద్ధమా?- మంత్రి ఉత్తమ్‌కు బీజేపీ ఎమ్మెల్యే సవాల్

Alleti Maheshwar Reddy (Photo Credit : Google)

Alleti Maheshwar Reddy : బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సవాల్ విసిరారు. నాతో చర్చకు సిద్ధమా? అని అడిగారు. నేను ఎవిడెన్స్ లేకుండా ఏమీ మాట్లాడను అని ఆయన అన్నారు. వాళ్లు ఇచ్చిన జీవోలు, లెటర్లు చూపిస్తానని అన్నారు. U టాక్స్ లో భాగంగా వెయ్యి కోట్ల స్కాం జరిగిందని, అందులో మంత్రి ఇన్వాల్వ్ అయ్యారని ఎమ్మెల్యే ఏలేటి ఆరోపించారు.

”పర్సనల్ గా నేను ఎవరినీ టార్గెట్ చెయ్యను. నాది అటువంటి క్యారెక్టర్ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ట్యాక్స్ పెరగడమే కానీ తగ్గడం ఉండదు. RR ట్యాక్స్, ఆ తర్వాత B ట్యాక్స్, ఇప్పుడు కొత్తగా U ట్యాక్స్ వచ్చింది. నేనే డైరెక్ట్ గా ఫోన్ చేసి సీఎం అపాయింట్ మెంట్ అడిగాను. వెళ్లి కలిశాను. సీఎం వద్ద పొలిటికల్ టాపిక్ రాలేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సివిల్ సప్లయ్ కాకుండా.. ఐటీ శాఖ ఇవ్వొచ్చు కదా అని అడిగాను. నేను చేసిన ఆరోపణలపై ఉత్తమ్ ఏం మాట్లాడతారో కౌంటర్ కి రెడీగా ఉన్నా. ఉత్తమ్ కుమార్ తో పూర్తి సాక్ష్యాలతో బహిరంగ చర్చకు సిద్ధం. పూర్తి డాక్యుమెంట్స్ తో చర్చకు వస్తా. మరి చర్చకు ఉత్తమ్ సిద్ధమా?

R టాక్స్, B టాక్స్ గురించి మాట్లాడినప్పుడు గమ్మున కూర్చున్న ఉత్తమ్.. U టాక్స్ అన్నప్పుడు ఎందుకు స్పందిస్తున్నారు. U టాక్స్ లో నిజం ఉంది కాబట్టే కదా. స్నేహితులుగా ఇంటికొస్తే దావత్ ఇస్తా. రాజకీయంగా మాత్రం ఎదిరిస్తా. తల్లి లాంటి బీజేపీ పార్టీని అంటే మాత్రం ఊరుకోను. కాంగ్రెస్ నాయకులు అంతా నాకు సమానమే. నా ఆరోపణలపై ఉత్తమ్ స్పందించకపోతే ఆయన కర్మ. మంత్రి ఉత్తమ్ చేసిన స్కాంలపై నా దగ్గర పూర్తి సాక్ష్యాలు ఉన్నాయి. మంత్రి ఉత్తమ్ చర్చకు ఎక్కడికి రమ్మన్నా నేను రెడీ” అని ఎమ్మెల్యే ఏలేటి మహేశర్ రెడ్డి అన్నారు.

Also Read : తెలంగాణలో సంచలన మార్పులకు పార్టీల శ్రీకారం..! కొత్త అధ్యక్షుడి ఎంపికపై ముమ్మర కసరత్తు