Amit Shah – Priyanka Gandhi: తెలంగాణలో అమిత్ షా, ప్రియాంక గాంధీ పర్యటనలు రద్దు.. కారణం ఏమిటింటే?
తెలంగాణలో బీజేపీ, కాంగ్రెస్ అగ్రనేతల పర్యటనలు వాయిదా పడ్డాయి. ఈనెల 29న కేంద్ర మంత్రి అమిత్ షా, 30న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీలు తెలంగాణలో పర్యటించాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల వారి పర్యటనలు రద్దయ్యాయి.

Amit Shah and Priyanka Gandhi
Amit Shah: తెలంగాణ రాష్ట్రంలో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తెలంగాణపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాయి. తెలంగాణలో మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. మరోవైపు.. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీని గద్దెదింపి అధికారపీఠం దక్కించుకొనేది మేమంటేమేమంటూ కాంగ్రెస్, బీజేపీల నేతలు దీమా వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణపై బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అగ్రనేతలు దృష్టిసారించారు. కాంగ్రెస్ నుంచి రాహుల్, ప్రియాంక గాంధీలు, బీజేపీ నుంచి ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా వంటి అగ్రనేతలు తెలంగాణ రాజకీయాలపై గురిపెట్టారు. ఈ క్రమంలో తెలంగాణలో వరుస పర్యటనలు చేసేందుకు వారు సన్నద్ధమయ్యారు. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారు.
Mamata Banerjee: నాకు సమాచారం అందింది.. ఎన్నికల ముందు బీజేపీ ఈ పని చేయనుంది: అసెంబ్లీలో మమతా బెనర్జీ
తెలంగాణలో ఈనెల 29న కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటించాల్సి ఉంది. హైదరాబాద్‌లో పలు పార్టీ కార్యక్రమాల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. అయితే, అమిత్ షా పర్యటన వాయిదా పడింది. గత నెలలో ఖమ్మంలో బహిరంగ సభలో అమిత్ షా పాల్గొనాల్సి ఉండగా గుజరాత్, తదితర రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా ఖమ్మం పర్యటన వాయిదా పడింది. తాజాగా మరోసారి అమిత్ షా పర్యటన వాయిదా పడటంతో బీజేపీ శ్రేణులను నిరాశకు గురిచేసింది. అయితే, రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా అమిత్ షా పర్యటన వాయిదా పడినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి వెల్లడించారు. అమిత్ షా పర్యటన తేదీ మళ్లీ ఎప్పుడు అనేది త్వరలోనే వెల్లడిస్తామని ఆయన తెలిపారు. అయితే, తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న వరదల పరిస్థితిపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడారని, తెలంగాణ ప్రజలను సురక్షితంగా కాపాడేందుకు రెస్క్యూ, రిలీఫ్ పనుల్లో సాధ్యమైన సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రెండు హెలికాప్టర్లు సేవలు అందిస్తున్నాయి. 5 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కూడా రెస్క్యూ, రిలీఫ్ పనులకోసం మోహరించారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని కిషన్ రెడ్డి ట్విటర్ వేదికగా తెలిపారు.
Jamili Elections: దేశమంతా ఒకేసారి ఎన్నికల విషయమై కీలక ప్రకటన చేసిన కేంద్ర ప్రభుత్వం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ దూకుడుమీద ఉంది. వరుస చేరికలతో ఆ పార్టీలో నూతనోత్సాహం నెలకొంటుంది. ఈనెల ప్రారంభంలో ఖమ్మం వేదికగా జరిగిన బహిరంగ సభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సభలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అయితే, మరో కీలక నేత జూపల్లి కృష్ణారావు ఈనెల 30న కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవాల్సి ఉంది. కొల్లాపూర్ వేదికగా జరిగే బహిరంగసభలో ప్రియాంకగాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరాల్సి ఉంది.
అయితే, రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రియాంక పర్యటన వాయిదా పడినట్లు తెలిసింది. మరో తేదీని త్వరలో ప్రకటిస్తామని కాంగ్రెస్ నేత మల్లు రవి తెలిపారు. అటు అమిత్ షా పర్యటన వాయిదాతో తెలంగాణ బీజేపీలో, ఇటు ప్రియాంక రాక వాయిదాతో కాంగ్రెస్ నేతల్లో కాస్త నిరాశ వ్యక్తమవుతుంది. అయితే, వర్షాలు తగ్గుముఖం పట్టిన తరువాత వీరి పర్యటనల తేదీలు మరోసారి ప్రకటిస్తామని ఆయా పార్టీల అగ్రనేతలు తెలిపారు.