Kandala Upender Reddy : కంటతడి పెట్టిన బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి
Kandala Upender Reddy Emotional : పక్కనే ఉన్న ఎంపీ నామా, పలువురు నాయకులు కందాల ఉపేందర్ రెడ్డిని సముదాయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Kandala Upender Reddy Emotional
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో చిత్రవిచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే టికెట్ రాలేదని కొందరు కంటతడి పెడుతుంటే.. టికెట్ దక్కిందనే ఆనందంలో మరికొందరు ఎమోషన్ అయిపోతున్నారు. తాజాగా పాలేరు ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. కూసుమంచి మండలం పాలేరులో ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి బూత్ స్థాయి కార్యకర్తల మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు.
ఈ సమావేశంలో మాట్లాడుతుండగా.. కార్యకర్తలు కందాల కందాల అంటూ నినాదాలు చేశారు. అంతే.. కందాల ఉపేందర్ రెడ్డి ఒక్కసారిగా భావోద్వేగానికి లోనయ్యారు. భోరున విలపించారు. పక్కనే ఉన్న ఎంపీ నామ, పలువురు నాయకులు కందాల ఉపేందర్ రెడ్డిని సముదాయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో వారసులు.. సత్తా నిరూపించుకుంటారా?
కాంగ్రెస్ నేతలపై కందాల ఉపేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ నాయకులు మాయ మాటలు చెబుతూ నియోజకవర్గంలో తిరుగుతున్నారని, అలాంటి వ్యక్తుల మాటలు ప్రజలు నమ్మొద్దని పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి చెప్పారు. అసత్యాలు ప్రచారం చేయడం కాదు దమ్ముంటే చర్చకు రావాలని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు కందాల.
ఖమ్మం జిల్లా ఎదులాపురంలో కందాల ఉపేందర్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలను వివరిస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థించారు. నియోజకవర్గం అభివృద్ది బీఆర్ఎస్ తోనే సాధ్యం అంటూ ప్రజలకు వివరించారు. కందాలకు మద్దతుగా ఎంపీ నామా నాగేశ్వరరావు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.