బండి సంజయ్ దీక్ష భగ్నం

బండి సంజయ్ దీక్ష భగ్నం

Updated On : October 27, 2020 / 8:43 PM IST

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు Bandi Sanjay దీక్ష భగ్నం అయింది. సోమవారం రాత్రి నుంచి దీక్షకు దిగిన సంజయ్.. ఆహారం తీసుకోకపోవడంతో షుగర్ లెవల్స్ పూర్తిగా పడిపోయాయి. ఈ మేరకు వైద్యులు హాస్పిటల్ కు తరలించాలని సూచించడంతో దీక్షను విరమించాల్సి వచ్చింది.

దుబ్బాక వెళ్తున్న సంజయ్‌పై సిద్దిపేట సీపీ దౌర్జన్యంగా చేయి చేసుకున్నందుకు గానూ వెంటనే ట్రాన్స్‌ఫర్ చేయాలని డిమాండ్‌ చేస్తూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ దీక్ష చేపట్టారు. సీపీని బదిలీ చేసి కేసు నమోదు చేసేవరకు తన కార్యాలయంలోనే దీక్ష విరమించనని సంజయ్‌ ప్రకటించారు.



బయటి నుంచి తాళం వేసుకుని రాత్రంతా కార్యాలయంలోనే నిర్బంధ దీక్ష కొనసాగించిన ఆయన మంగళవారం సాయంత్రానికి పూర్తిగా బలహీనమైపోయారు. వైద్యులు సూచించడంతో హాస్పిటల్ కు తరలించాల్సి వచ్చింది.