Bandi Sanjay: అప్పులు ఉన్నాయని ఎన్నికల ముందు ప్రచారం చేశాం.. అయినప్పటికీ..: బండి సంజయ్
ప్రణాళిక వివరించి ప్రజలకు భరోసా ఇవ్వాలని బండి సంజయ్ అన్నారు. అప్పులు తీర్చేందుకు వేసుకున్న..

Bandi Sanjay
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మండిపడ్డారు. తెలంగాణకు అప్పులు ఉన్నాయని తాము ఎన్నికల ముందు ప్రచారం చేశామని, అయినప్పటికీ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చిందని చెప్పారు.
ఆ హామీలను 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా అమలు చేస్తుందో చెప్పాలని బండి సంజయ్ నిలదీశారు. తెలంగాణకు అప్పు ఉందని చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీ టైమ్ పాస్ చేస్తుందని అన్నారు. కొత్త ప్రభుత్వం అని చెప్పుకుంటూ ప్రజలను మోసం చేయొద్దని ఆయన చెప్పారు.
ప్రణాళిక వివరించి ప్రజలకు భరోసా ఇవ్వాలని బండి సంజయ్ అన్నారు. అప్పులు తీర్చేందుకు వేసుకున్న ప్రణాళికలను చెబితేనే పెట్టుబడులు వస్తాయని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పలు సూచనలు చేస్తున్నానని ఆయన అన్నారు. డ్రగ్స్ కేసును తిరగదోడాలని చెప్పారు. దానిలో ఎంత పెద్దవాళ్లున్నా బయటకు లాగాలని అన్నారు.
ఇంటర్ విద్యార్థుల బలవన్మరణాలపై విచారణ జరిపించాలని బండి సంజయ్ చెప్పారు. ఆ కేసులు ఎందుకు మూసివేశారో బయటపెట్టాలని అన్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ కేసును ఎవరు నీరు గార్చారని ప్రశ్నించారు. నయీం అక్రమాస్తులు ఎటు పోయాయని నిలదీశారు. ఈ కేసులో విచారణ జరిపిస్తే చాలా పార్టీల నేతలు బయటపడతారని చెప్పారు.
Narayana Swamy: సీఎం జగన్ టికెట్లు జాగ్రత్తగా ఇవ్వాలి.. లేదంటే..: డిప్యూటీ సీఎం నారాయణ స్వామి