హైదరాబాద్‌కు ఎంఐఎం మేయర్ అయితే తెలంగాణ రాష్ట్రానికి ఇద్దరు సీఎంలు అవుతారు

  • Published By: naveen ,Published On : November 23, 2020 / 12:54 PM IST
హైదరాబాద్‌కు ఎంఐఎం మేయర్ అయితే తెలంగాణ రాష్ట్రానికి ఇద్దరు సీఎంలు అవుతారు

Updated On : November 23, 2020 / 1:07 PM IST

bandi sanjay ghmc elections: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. ప్రత్యర్థిపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. అధికార టీఆర్ఎస్ ని బీజేపీ టార్గెట్ చేసింది. హైదరాబాద్ అభివృద్ధి బీజేపీతోనే సాధ్యం అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇస్తే భాగ్యనగరం రూపురేఖలు మారుస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు ఇచ్చి హైదరాబాద్ అభివృద్ధికి తోడ్పడిందని చెప్పారు.


https://10tv.in/will-cm-kcr-fulfill-gutha-sukender-reddy-dream/
సీఎం కేసీఆర్ పై బండి సంజయ్ మండిపడ్డారు. హైదరాబాద్ లో వరదలు వస్తే సీఎం కేసీఆర్ పర్యటించ లేదన్నారు. హైదరాబాద్ ని విశ్వనగరం చేస్తామని చెప్పి విషాద నగరంగా మార్చారని అన్నారు. ఎంఐఎంతో కలిసి హైదరాబాద్ ను కబళించే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తోందని ఆరోపించారు. ఎంఐఎంకు మేయర్ పదవి ఇచ్చే ప్రయత్నం టీఆర్ఎస్ చేస్తోందన్నారు. హైదరాబాద్ కు ఎంఐఎం మేయర్ అయితే రాష్ట్రానికి ఇద్దరు సీఎంలు అవుతారని బండి సంజయ్ అన్నారు.