Maganti Sunitha: ప్రజలే ఆయన కుటుంబం.. గోపన్న అని పిలిస్తే చాలు.. ఇలా అవుతుందని మేము కూడా ఊహించలేదు- బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎమోషనల్..

ప్రజలు ఆయనను ఎంతో ఇష్టపడే వారు. తమ ఇంటి పెద్ద కొడుక్కుగా భావించే వారు.

Maganti Sunitha: ప్రజలే ఆయన కుటుంబం.. గోపన్న అని పిలిస్తే చాలు.. ఇలా అవుతుందని మేము కూడా ఊహించలేదు- బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత ఎమోషనల్..

Updated On : October 27, 2025 / 9:50 PM IST

Maganti Sunitha: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఆయన కలలను సాకారం చేసేటువంటి సంకల్పంతో ప్రజల ముందుకు వస్తున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి, గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత. జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో పాటు ప్రజల్లో ఎదురయ్యేటువంటి సవాళ్లు, ప్రతి సవాళ్లను ఆవిడ ఎలా ఎదుర్కొంటారు? ఆవిడ మాటల్లోనే తెలుసుకుందాం..

మాగంటి గోపీనాథ్ అనారోగ్యం గురించి కనీస సమాచారం కూడా ఎవరికీ లేదు? ఎందుకు?

”ఇలా అవుతుందని మేము కూడా ఊహించలేదు. ఆయనకు వచ్చిన హెల్త్ ఇష్యూస్ బయటకు చెప్పడం ఆయనకు ఇష్టం ఉండదు. అంటే తన ఫ్యామిలీకి సంబంధించినది బయట ఎందుకు చెప్పుకోవాలి? జనాలు, కార్యకర్తలు ఎవరికి తెలిసినా.. కంగారుపడిపోతారు. ఆ ఇష్యూని పెద్దది చేసుకోవడం ఎందుకు? మన వరకే మనం చూసుకోవాలి. అని ఆయన ఎప్పుడూ అనుకునే వారు.

ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి గోపన్నే అలవాటు. ప్రజలు, కార్యకర్తలతో బాగా మమేకం అయ్యేవారు. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే వారు. అది ఆయనకు చాలా ఇష్టం. ఇవాళ ఒకరి బాధను పోగొట్టాను అని ఆనందించేవారు. విడిగా ఉంటే ఇటువంటివి వీలు కావు. ఒక పదవిలో ఉంటే ఎంతమందికైనా సాయం చేయగలను అని నాతో చెప్పేవారు. అలానే ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి నుంచి కూడా ప్రెజర్ తోనే ఉన్నారు.

అర్థరాత్రి ఫోన్ చేసి సాయం కోరితే వెళ్లిపోయే వారు. ఎవరు ఏ బాధలో ఉన్నా.. అన్నా అంటే చాలు.. వెంటనే వాలిపోయే వారు. ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయ్యే వరకు నిలబడే వారు. ప్రతి ఇంటికి ఆయన అండగా ఉండేవారు. ప్రజలు ఆయనను ఎంతో ఇష్టపడే వారు. తమ ఇంటి పెద్ద కొడుక్కుగా భావించే వారు. సొంత కుటుంబం కంటే.. జూబ్లీహిల్స్ ప్రజలే తన కుటుంబం అని భావించి వారితోనే ఎక్కువ సేపు గడిపే వారు. ఉదయం వెళితే రాత్రి ఇంటికి వచ్చేవారు. ఎన్నో సార్లు ఫోన్ చేసే దాన్ని, ఒక్కోసారి ఫోన్ తీసే వారు కాదు” అని తన భర్తను గుర్తు చేసుకుని మాగంటి సునీత ఎమోషనల్ అయ్యారు.

Also Read: క్యాబినెట్ దండుపాళ్యం ముఠాలా తయారైందన్న హరీశ్.. సీఎం, మంత్రుల మధ్య టగ్‌ ఆఫ్‌ వార్ నడిచిందా?