కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, పలువురు కార్పొరేటర్లు

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అరెకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.

కాంగ్రెస్‌ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, పలువురు కార్పొరేటర్లు

MLA Arekapudi Gandhi

Updated On : July 13, 2024 / 12:02 PM IST

Arekapudi Gandhi : బీఆర్ఎస్ పార్టీకి షాక్ ల మీద షాక్ లు తుగులుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటున్నారు. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరగా.. తాజాగా శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. భారీ సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు.

Also Read : చంద్రబాబు కీలక నిర్ణయం.. కాళ్లకు దండం పెట్టే విధానానికి ఫుల్‌స్టాప్‌ పెట్టాలంటూ సూచన

సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో అరెకపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. అరెకపూడి గాంధీతోపాటు శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్, మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, బీఆర్ఎస్ నేత మువ్వ సత్యనారాయణ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరో రెండు రోజుల్లో హైదర్ నగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తెలిసింది.

Aolso Read : ఉద్యోగులకు షాకిచ్చిన ఏపీ ప్రభుత్వం.. గత ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే..

అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున 39 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అకాల మరణంతో ఆ స్థానంకు ఉప ఎన్నికలు నిర్వహించారు. ఆ ఉపఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించాడు. దీంతో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలం 38కి చేరింది. గత ఆర్నెళ్ల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇప్పటికే తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోగా.. ఇవాళ శేరిలింగంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. మరికొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.