Cherla Encounter : 2018 చర్ల ఎన్‌కౌంటర్.. తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
2018 తెలంగాణ, ఒడిశా సరిహద్దు చెర్లలో జరిగిన మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ పూర్తి అయ్యింది. కోర్టు కీలక తీర్పు ఇచ్చింది.

Cherla Encounter
Cherla Encounter : 2018 తెలంగాణ, ఒడిశా సరిహద్దు చెర్లలో జరిగిన మావోయిస్టుల ఎన్ కౌంటర్ పై హైకోర్టులో విచారణ పూర్తి అయ్యింది. కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. తదుపరి ఎలాంటి విచారణ జరపాల్సిన అవసరం లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది.
New Year Amazon Deal: రూ.65వేల OnePlus 9Pro 5G ఫోన్ 30వేలకే!
2018లో జరిగిన ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టుల మృతి చెందారు. ఈ ఎన్ కౌంటర్ పై ప్రజా హక్కుల సంఘం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేసింది. ఇది బూటకపు ఎన్ కౌంటర్ అని ఆరోపించింది. మృతదేహాలకు రీ-పోస్టుమార్టం చేయాలని, పోలీసులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని పిటిషనర్ కోరారు.
Fenugreek Seeds : చెడు కొలెస్ట్రాల్ ను కరిగించి బరువు తగ్గించే మెంతులు
పిటిషనర్ కోరిన విధంగా మృతదేహాలకు రీ పోస్టుమార్టం చేశారని, హత్యానేరం కింద కేసు నమోదు చేశారని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టుకి తెలిపారు. దీంతో ఈ కేసులో తదుపరి విచారణ జరపాల్సిన అవసరం లేదని కోర్టు వ్యాఖ్యానించింది. హైకోర్టు ఆర్డర్ కాపీ వచ్చిన 3 నెలల లోపు ఎన్ కౌంటర్ కు సంబంధించిన దర్యాప్తు పూర్తి చేయాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.