Karate Kalyani : బీజేపీలో చేరిన సినీనటి కరాటే కళ్యాణి

సినీనటి కరాటే కళ్యాణి బీజేపీలో చేరారు. హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ నేతృత్వంలో బీజేపీలో చేరారు.

Karate Kalyani : బీజేపీలో చేరిన సినీనటి కరాటే కళ్యాణి

Bjp

Updated On : August 15, 2021 / 8:58 PM IST

Karate Kalyani joined BJP : సినీనటి కరాటే కళ్యాణి బీజేపీలో చేరారు. హైదరాబాద్ లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మహిళా మోర్చా అధ్యక్షురాలు ఆకుల విజయ నేతృత్వంలో బీజేపీలో చేరారు. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కండువా కప్పి ఆమెను ఆహ్వానించారు. కరాటే కళ్యాణితోపాటు ఆమె అనుచరులు 10 మంది పార్టీలో చేశారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. హిందూ ధర్మాన్ని, భారతదేశ ధర్మాన్ని కాపాడగలిగే పార్టీ బీజేపీ ఒక్కటేనని ఆమె అన్నారు. విజయశాంతిని ఒక పెద్ద అక్కగా తమకు ఎప్పుడూ అండగా ఉంటారని చెప్పారు. అలాంటి వారి అవసరం బీజేపీలో చాలా ఉందన్నారు.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న కరాటే కళ్యాణి కొద్ది రోజుల క్రితం తాను ఆగస్టు 15న బీజేపీలో చేరనున్నట్లు ప్రకటించారు. ఆమె అన్నట్లుగానే ఇవాళ బీజేపీలో చేరారు. కరాటే కళ్యాణితో పాటు జల్ పల్లి కౌన్సిలర్ యాదయ్య, పలువురు సినీ నటులు, ఇతర పార్టీల నేతలు కూడా బీజేపీలో చేరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు విజయశాంతి, కార్యకర్తలు పాల్గొన్నారు.