Cm Chandrababu Cm Revanth: ఒకే వేదికపై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. పక్కపక్కనే కూర్చుని సరదాగా నవ్వుతూ.. వీడియో వైరల్..

దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

Cm Chandrababu Cm Revanth: ఒకే వేదికపై సీఎం చంద్రబాబు, రేవంత్ రెడ్డి.. పక్కపక్కనే కూర్చుని సరదాగా నవ్వుతూ.. వీడియో వైరల్..

Updated On : November 16, 2025 / 10:25 PM IST

Cm Chandrababu Cm Revanth: తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఒకే వేదికపై కనిపించారు. చాలా రోజుల తర్వాత వారు ఒకే చోట కలిసి కనిపించారు. అంతేనా.. పక్కపక్కనే కూర్చున్నారు. సరదాగా మాట్లాడుకున్నారు. నవ్వులు చిందించారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో నిర్వహించిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవానికి సీఎం చంద్రబాబు, ముఖ్యమంత్రి రేవంత్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ ఆసక్తికర సన్నివేశం కనిపించింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ హాజరయ్యారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ, మై హోమ్ గ్రూప్ ఛైర్మన్ జూపల్లి రామేశ్వరరావు తదితరులు అవార్డుల ప్రదానోత్సవానికి హాజరయ్యారు.

ఇక, ఈ కార్యక్రమంలో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇద్దరూ నవ్వులు చిందిస్తూ ముచ్చటించుకున్న దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.

Also Read: తెలంగాణలో బీజేపీ భవిష్యత్తు ఏంటి? అధికారంలోకి వస్తుందా? 10టీవీ వీకెండ్ పాడ్‌కాస్ట్‌లో ఎంపీ డీకే అరుణ..