Revanth Reddy : మా మేనిఫెస్టోను కేసీఆర్ కాపీ కొట్టారు- రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

రూ.500లకే సిలిండర్ అని మేమంటే.. ఆయన రూ.400కే ఇస్తామన్నారు. మేము రూ.4వేల పెన్షన్ అంటే.. ఆయన రూ.5వేలు అన్నారు. Revanth Reddy

Revanth Reddy : మా మేనిఫెస్టోను కేసీఆర్ కాపీ కొట్టారు- రేవంత్ రెడ్డి తీవ్ర విమర్శలు

Revanth Reddy Criticise CM KCR

Revanth Reddy – CM KCR : బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందించారు. సీఎం కేసీఆర్ ప్రకటించిన మేనిఫెస్టోపై తీవ్ర విమర్శలు చేశారు రేవంత్ రెడ్డి. సీఎం కేసీఆర్ కాంగ్రెస్ మేనిఫెస్టోను కాపీ కొట్టారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ”కాంగ్రెస్ ప్రకటించిన 6 గ్యారెంటీలను సీఎం కేసీఆర్ కాపీ కొట్టారు. మహాలక్ష్మి పేరిట మేము రూ.2,500 అంటే కేసీఆర్ 3వేలు అన్నారు.

ఆడబిడ్డలకు రూ.500లకే సిలిండర్ అని మేమంటే.. ఆయన రూ.400కే ఇస్తామన్నారు. మేము రూ.4వేల పెన్షన్ అంటే.. ఆయన రూ.5వేలు అన్నారు. రైతులకు పెట్టుబడి కింద రూ.15వేలు అంటే కేసీఆర్ రూ.16వేలు అంటున్నారు” అని రేవంత్ రెడ్డి అన్నారు.

Also Read : బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల.. కేసీఆర్‌ బీమా కింద కుటుంబానికి రూ.5 లక్షలు.. ప్రతి ఇంటికీ ఇకపై సన్నబియ్యం

”రెండేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటినీ కాగితంపై రాసుకుని ఇవాళ బీఆర్ఎస్ మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. మేం రూ.4 వేల పెన్షన్, రూ.400కే గ్యాస్ సిలిండర్ ఇస్తామంటే అదెలా సాధ్యమవుతుంది? అంటూ ఇన్నాళ్లు మాట్లాడిన బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు వారి మేనిఫెస్టోపై ఏం సమాధానం చెబుతారు? ఇందిరమ్మ భరోసా కింద రైతులకు రూ.15వేలు ఇస్తామంటే అదెలా సాధ్యమవుతుంది అన్నారు.

పేదలకు ఇళ్ల స్థలాల కోసం రూ.5లక్షలు ఇస్తామంటే నిధులు ఎక్కడి నుంచి తెస్తారని మమ్మల్ని ప్రశ్నించారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ కింద మేం రూ.10 లక్షలు ఇస్తామంటే అది అసాధ్యమన్నారు. ఇప్పుడదే బీఆర్ఎస్ నేతలు రూ.15 లక్షల బీమా అని ప్రకటించారు. కేసీఆర్ బీమా అంటూ మరో రూ.5 లక్షలు అంటున్నారు” అని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగిన సంగతి తెలిసిందే. నవంబర్ 30న ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ సమరశంఖం పూరించారు. ఇవాళ బీఆర్ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను రిలీజ్ చేశారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలకు ధీటుగా బీఆర్ఎస్ మేనిఫెస్టోలో అంశాలు పొందుపరిచారు కేసీఆర్. బీఆర్ఎస్ స్కీములు ఆషామాషీగా ఉండవని, దేశానికే ఆదర్శంగా ఉంటాయని మేనిఫెస్టో విడుదల సందర్భంగా కేసీఆర్ అన్నారు.

బీఆర్ఎస్ మేనిఫెస్టో:
* తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి రైతు బీమా తరహా కేసీఆర్ బీమా.
* ప్రతి ఇంటికి ధీమా పథకం. కుటుంబానికి 5 లక్షల బీమా. ప్రీమియం మొత్తం ప్రభుత్వమే చెల్లిస్తుంది.
* తెలంగాణ అన్నపూర్ణ పథకం కింద ప్రతి ఇంటికీ ఇకపై సన్నబియ్యం. రేషన్ కార్డు ఉన్న అందరికీ సన్నబియ్యం.
* ఆసరా పెన్షన్లు రూ.3వేలకు పెంపు.
* దివ్యాంగులకు పెన్షన్ రూ.6 వేలకు పెంపు
* రైతుబంధు పథకం దశలవారీగా రూ.16 వేలకు పెంపు. రైతు బంధును ముందుగా రూ.12 వేలకు పెంపు.
* అర్హులైన పేద మహిళలకు సౌభాగ్య లక్ష్మి పథకం కింద నెలకు రూ.3వేల చొప్పున భృతి.
* అర్హులైన వారికి రూ.400కే గ్యాస్ సిలిండర్.
* గుర్తింపు పొందిన జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్. అక్రిటిడేషన్ ఉన్నవారికి వర్తింపు. ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో జర్నలిస్టులకు రూ.15 లక్షల వరకు వైద్య సేవలు.
* హైదరాబాద్‌ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో మరో 2 లక్షల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం.
* అగ్రవర్ణ పేదల కోసం ప్రతి నియోజకవర్గంలో గురుకులాలు. మొత్తం 119 గురుకులాలు.
* ఆరోగ్యశ్రీ బీమా మొత్తం రూ.15 లక్షలకు పెంపు.
* డిగ్రీ కాలేజీలుగా జూ. కాలేజీలు.
* మహిళా స్వశక్తి గ్రూప్‌లకు సొంత భవనాలు.
* అనాథ పిల్లల కోసం పటిష్ఠ పాలసీ.
* ప్రభుత్వ ఉద్యోగుల ఓపీఎస్ కోసం కమిటీ.
* మహిళా సంఘాలకు స్వశక్తి భవనాలు.
* అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేత.. అసైన్డ్ భూముల సొంతదారులకు పట్టా హక్కులు.

Also Read : కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల.. 55 నియోజకవర్గాలకు అభ్యర్థుల పేర్లు ప్రకటన