CM KCR : తెలంగాణలో ఎకరం అమ్మితే ఏపీలో 50 ఎకరాలు కొనొచ్చని చంద్రబాబే అన్నారు : కేసీఆర్
తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రప్రదేశ్ లో 50 ఎకరాలు కొనొచ్చు.

CM KCR..Chandrababu Naidu
CM KCR..Chandrababu Naidu : సంగారెడ్డిలో సీఎం కేసీఆర్ పర్యటన భాగంగా సీఎం కేసీఆర్ పటాన్ చెరు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతు..తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఎంతో అభివృద్ధి చేసుకున్నామని దీంతో రాష్ట్రంలో భూములకు ధరలు బాగా పెరిగాయని అన్నారు. గతంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో ఎకరం భూమి అమ్మితే తెలంగాణలో 50 ఎకరాలు వస్తాయని కానీ ఇప్పుడలా కాదు..తెలంగాణలో ఎకరం భూమి అమ్మితే ఆంధ్రప్రదేశ్ లో 50 ఎకరాలు కొనొచ్చని చంద్రబాబే అంటున్నారని అన్నారు సీఎం కేసీఆర్.
CM KCR : మళ్లీ గెలిపిస్తే పటాన్ చెరుకు మెట్రో రైలు, ఐటీ కంపెనీలు : సీఎం కేసీఆర్ వరాలు
మీరు మరోసారి BRSను గెలిపిస్తే తెలంగాణను మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు. మంచి నాయకత్వం,మంచి ప్రభుత్వం వల్లే అభివద్ధి జరుగుతుందన్నారు. ఒకప్పుడు తెలంగాణలో కరెంటే ఉండేది కాదు..పరిశ్రమలు చాలా నష్టపోయేవి..కానీ ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇస్తున్నామని దీంతో పరిశ్రమలు లాభాలు ఆర్జిస్తున్నాయన్నారు. గతంలో పటాన్ చెరులో పరిశ్రమలు కరెంట్ కోసం సమ్మెలు చేసేవి..కానీ ఇప్పుడు రోజుకు 24గంటలు సరఫరాతో రోజుకు మూడు షిప్టులు పనిచేస్తున్నాయని తెలిపారు.
మోసపోతే గోస పడతాం..జాగ్రత్తగా ఉండాలని కేసీఆర్ సూచించారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి గెలిపిస్తే మీరు కోరుకున్నవన్ని నెరవేరుతాయని అన్నారు.హైదరాబాద్ లో భూముల విలువ పెరిగిందని చంద్రబాబు స్వయంగా చెప్పారని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు.