CM KCR: సీఎం కేసీఆర్ జిల్లాల పర్యటన.. మెదక్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్న బీఆర్ఎస్ అధినేత
సీఎం కేసీఆర్ మెదక్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం తేదీలు ఖరారయ్యాయి.

CM KCR
Telangana CM KCR: తెలంగాణ (Telangana) లో మరికొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు (Assembly elections) జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో అన్ని రాజకీయ పార్టీల అగ్రనేతలు జిల్లాల బాటపడుతున్నారు. వరుస పర్యటనతో రాష్ట్రంలో రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా సీఎం కేసీఆర్ (CM KCR) జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఇటీవల పలు జిల్లాల్లో వరుసగా పర్యటనలు చేసిన సీఎం కేసీఆర్ ఆయా జిల్లాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడ నిర్వహించిన బహిరంగ సభల్లో పాల్గొని కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై విమర్శలు గుప్పించారు. తరువాత కొద్దిరోజుల గ్యాప్ తీసుకున్న సీఎం కేసీఆర్ మరోసారి జిల్లాల్లో పర్యటించేందుకు సిద్ధమయ్యారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈనెల 19, 20 తేదీల్లో మెదక్, సూర్యాపేట జిల్లాల్లో పర్యటించనున్నారు. అక్కడ జరిగే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. తొలుత 19న మెదక్ జిల్లాలో కేసీఆర్ పర్యటన ఉంటుంది. ఈ పర్యటనలో భాగంగా మెదక్ కలెక్టరేట్, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాలను కేసీఆర్ ప్రారంభిస్తారు. అదేవిధంగా జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం జరిగే బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గోనున్నారు.
ఈనెల 20న సీఎం కేసీఆర్ సూర్యాపేట జిల్లాలో పర్యటించనున్నారు. ఆ జిల్లాలో కలెక్టరేట్, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాలతోపాటు నూతనంగా నిర్మించిన మెడికల్ కాలేజీని కూడా ప్రారంభిస్తారు. అనంతరం సూర్యాపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్న కేసీఆర్.. అనంతరం జరిగే బహిరంగసభలో పాల్గొని ప్రసంగిస్తారు. సీఎం కేసీఆర్ పర్యటనల తేదీలు ఖరారైన సందర్భంగా మెదక్, సూర్యాపేట జిల్లాల అధికారులు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు పర్యటన ఏర్పాట్లపై దృష్టిసారించారు.
ఈనెల 19, 20 తేదీల్లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు జిల్లాల పర్యటన చేపట్టనున్నారు.
మెదక్ జిల్లా పర్యటన:
———————-
ఈనెల 19వ తేదీన (శనివారం) మెదక్ జిల్లా కలెక్టర్ కార్యాలయం, జిల్లా పోలీసు (ఎస్పీ) కార్యాలయాన్ని సీఎం ప్రారంభించనున్నారు.సూర్యాపేట జిల్లా పర్యటన:…
— Telangana CMO (@TelanganaCMO) August 12, 2023