హైదరాబాద్ లో కానిస్టేబుల్ కు కరోనా

  • Published By: srihari ,Published On : May 28, 2020 / 09:25 AM IST
హైదరాబాద్ లో కానిస్టేబుల్ కు కరోనా

Updated On : May 28, 2020 / 9:25 AM IST

కరోనా నివారణకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో నిరంతరం ప్రజలకు సేవలందిస్తున్న పోలీసులకు సోకుతుండటం ఆందోళన కల్గిస్తోంది. హైదరాబాద్ లో విధులు నిర్వర్తిస్తున్న పోలీసుల్లో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. నగరంలో మరో కానిస్టేబుల్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. 
 
రామంతాపూర్ వెంకట్ రెడ్డి నగర్ లో నివాసం ఉంటూ గాంధీలో సెక్యూరిటీ వింగ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న వ్యక్తికి కరోనా పాజిటివ్ గా డాక్టర్లు నిర్ధారించారు.
సంబంధిత వ్యక్తి గాంధీ హాస్పిటల్ కు వెళ్లి చికిత్స చేయించుకున్నాడు. 

కుటుంబ సభ్యులు వారం రోజుల క్రితమే సొంతూరుకు వెళ్లినట్లు సమాచారం. ఇదివరకు నాచారంలో ఉంటూ గాంధీలో పని చేస్తున్న పోలీస్ సిబ్బందికి నిన్న కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.

Read: లాక్‌డౌన్‌లో 5 రాష్ట్రాలకు అన్నం పెట్టిన తెలంగాణ