తెలంగాణలో మళ్లీ కరోనా పంజా : హైదరాబాద్ లో @417 కేసులు

తెలంగాణలో మళ్లీ కరోనా పంజా : హైదరాబాద్ లో @417 కేసులు

Updated On : June 23, 2021 / 1:01 PM IST

తెలంగాణాలో మళ్లీ కరోనా పంజా విసురుతోంది. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పడుతుందని అనుకుంటున్న క్రమంలో కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. 2020, ఏప్రిల్ 17వ తేదీ శుక్రవారం మరో 66 కేసులు నమోదు కావడం వైరస్ ఎంత వ్యాప్తి చెందుతుందో అర్థం అవుతోంది. రాష్ట్రంలో అత్యధికంగా గ్రేటర్ హైదరాబాద్ లో 417 కేసులు రికార్డయ్యాయి. మొత్తం 186 మంది డిశ్చార్జ్ అయ్యారు.

ఇందులో 131 మంది హైదరాబాద్ వాసులున్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా 13 జిల్లాలో 209 క్లస్టర్లలో 1, 09, 975 గృహాల్లో 4 లక్షల 39 వేల 900 మందిని వైద్య సిబ్బంది సర్వే చేయడం జరిగిందని ఉన్నతాధికారులు వెల్లడించారు. ఇది ఇలా ఉంటే…సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో ఈ లైబ్రరిలో రెగ్యులర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ కు కరోనా సోకిందనే వార్తలు హల్ చల్ చేశాయి. ఈ ఉద్యోగి జ్వరం, జలుబు, దగ్గుతో బాధ పడుతుండడంతో గాంధీ వైద్యలను సంప్రదించాడు.

కరోనా లక్షణాలుగా భావించి..వెంటనే ఐసోలేషన్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇతను ఎవరెవరితో సన్నిహితంగా మెలిగాడు ? ఇతరత్రా విషయాలపై ఆరా తీస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లాలో మరో రెండు కరోనా కేసులు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. సూర్యాపేట జిల్లాలో శుక్రవారం మరో 15 కేసులు నమోదు కావడం జిల్లా వాసులను కలవర పెడుతోంది. (విద్యార్ధుల కోసం…రాజస్థాన్ కు 200బస్సులు పంపిన యూపీ)