మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో కరోనా టెస్టింగ్ బూత్ 

మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో కరోనా టెస్టింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో కరోనా టెస్టింగ్ బూత్ 

Updated On : June 19, 2021 / 5:39 PM IST

మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో కరోనా టెస్టింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు.

మహబూబ్ నగర్ జిల్లా ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ లో కరోనా టెస్టింగ్ బూత్ ను ఏర్పాటు చేశారు. ఈ మేరకు సోమవారం (ఏప్రిల్ 20, 2020) మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 11 కరోనా కేసులు ఉన్నప్పటికీ తర్వాత వ్యాప్తి చెందకుండా నియంత్రించ కలిగామని చెప్పారు. కరోనా నివారణకు జిల్లా కలెక్టర్ తోపాటు పోలీస్, మున్సిపల్ సిబ్బంది కలిసి కట్టుగా పని చేస్తున్నట్లు తెలిపారు.

మహబూబ్ నగర్ కు కరోనా టెస్టింగ్ బూత్ మంజూరు చేయాలని కోరిన వెంటనే ఐటీ శాఖ మంత్రి కేటీఆర్.. 12 గంటల్లో మంజూరు చేశారని తెలిపారు. అందుకుగానూ కేటీఆర్ కు మంత్రి అభినందనలు తెలిపారు. కరోనా వైరస్ శాంపిల్స్ టెస్టింగ్ కేంద్రం వల్ల శాంపిల్స్ సేకరణ తీసుకునే ల్యాబ్ టెక్నీషియన్, శాంపిల్స్ ఇచ్చే వారికి కూడా ఎలాంటి భయం లేకుండా ఉంటుందని చెప్పారు. జిల్లా ప్రజలు లాకౌడౌన్ నిబంధనలు పాటించాలన్నారు. సామాజిక దూరం పాటించి ఎవరికి వారు స్వీయ నియంత్రణలో ఉండాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఎస్ వెంకట్రావ్, అదనపు కలెక్టర్ మోహన్ లాల్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ కిషన్, మెడికల్ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ డా.సునందిని, మున్సిపల్ కమిషనర్ సురేందర్, డిప్యూటీ సూపరింటెండెంట్ డా.జీవన్, ఆర్ఎంవో వంశీకృష్ణ, డిప్యూటీ డీఎంహెచ్ వో సౌభాగ్యలక్ష్మీ, డా.శశికాంత్ తోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Also Read | చేతిలో మహాభారతం బుక్ తో… మధ్యప్రదేశ్ గుహలో ముంబై ఇంజినీర్