Dalita Bandhu Scheme : దళిత బంధు పథకం ప్రారంభం

తెలంగాణలో దళిత బంధు పథకం అమలు అయింది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి వాసాలమర్రి గ్రామం నుంచి దళిత బంధు ప్రారంభించారు.

Dalita Bandhu Scheme : దళిత బంధు పథకం ప్రారంభం

Dalita Bandhu (1)

Updated On : August 16, 2021 / 12:01 PM IST

Dalita Bandhu scheme : తెలంగాణలో దళిత బంధు పథకం అమలు అయింది. యాదాద్రి జిల్లా తుర్కపల్లి వాసాలమర్రి గ్రామం నుంచి దళిత బంధు ప్రారంభించారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసింది. వాసాలమర్రి గ్రామానికి సంబంధించిన ప్రతిపాదనలను జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి సమర్పించారు.

వాసాలమర్రిలోని అర్హులైన దళితుల కోసం 7.6 కోట్ల రూపాయల నిధులను విడుదల చేశారు. నిధుల విడుదలకు టీఎస్ సి సి డి ఎస్ వైస్ చైర్మన్ అండ్ ఎండీ అనుమతినిచ్చారు. ఈ పథకం కింద వాసాలమర్రికి సంబంధించిన 76 కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది.

నిన్న దత్తత గ్రామం వాసాలమర్రికి వచ్చిన సీఎం కేసీఆర్ అక్కడే నుంచే దళిత బంధు పథకానికి శ్రీకారం చుట్టారు. 76 కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున వెంటనే అకౌంట్లలో జమ చేస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ ఆ నిధులను విడుదల చేశారు. గ్రామానికి రూ.7.6 కోట్ల నిధుల‌ను మంజూరు చేశారు.

ద‌ళిత బంధు నిధులు విడుద‌ల చేయడంతో వాసాల‌మ‌ర్రి ద‌ళితులు సంబురాలు చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. కేసీఆర్‌కు రుణ‌ప‌డి ఉంటామ‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ చిత్ర‌ప‌టానికి పాలాభిషేకం చేశారు.