ధరణి పోర్టల్ పుణ్యమా అని గిఫ్ట్‌ ఆస్తులొస్తున్నయ్!!

ధరణి పోర్టల్ పుణ్యమా అని గిఫ్ట్‌ ఆస్తులొస్తున్నయ్!!

Updated On : November 17, 2020 / 10:45 AM IST

Dharani portal: ధరణి పోర్టల్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూసిన యూజర్లకు గుడ్ న్యూస్‌నే అందిస్తుంది. లంచాలను అరికట్టే విధంగా తీసుకొచ్చిన సర్వీసు ప్రజలకు మరింత ఉపయోగపడేలా చర్యలు తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. దీని ద్వారా రెట్టింపు బెనిఫిట్ పొందే వాళ్లు ఉన్నారు.




ఉదాహరణకు కేసముద్రంలో ఉండే ఎల్లయ్య భార్య సండా కలమ్మకు రెండు ఎకరాల పొలం తన పేరు మీదకు వచ్చేలా చేసింది. ఆమె భర్త పేరిట మీదనే ఉండే రెండెకరాల పొలాన్ని సగం రిజిస్ట్రేషన్ లో తన పేరు రావడంతో ఆమె సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి.



‘ఎంతో కాలం నుంచి నా పేరు మీద కూడా పొలం ఉండాలని కోరుకునేదాన్ని. చాలా మంది రిజిస్ట్రేషన్ ప్రక్రియ చాలా ఖర్చుతో కూడుకున్నది. అక్కడున్న వారికి లంచాలు ఇవ్వాల్సి ఉంటుందని భయపెట్టారు. కానీ, ఇప్పుడు ధరణి పోర్టల్ వచ్చాక మండల్ ఆఫీసులో ప్రోసెసింగ్ ఫీజు కంటే ఒక్క రూపాయి కూడా ఎక్కువ చెల్లించకుండా నా పేరు మీదకు పొలం వచ్చేసింది’ అని ఆమె ఆనందంతో విషయాన్ని వెల్లడించింది.
https://10tv.in/cm-kcr-focus/
ఈ ప్రోసెస్ మొత్తం కేవలం 20నిమిషాల్లో పూర్తయిపోయిందని కలమ్మ చెప్పింది. ‘టీఆర్ఎస్ ప్రభుత్వానికి థ్యాంక్స్. ఇబ్బంది లేకుండా పారదర్శకమైన వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. నా పేరు మీద స్థలం ఉండాలనే కోరికను తీర్చింది’ అని చెపపింది.




‘ప్రజలు తమ ఆస్తులను కుటుంబ సభ్యుల పేరిట డివైడ్ చేయడం మొదలుపెట్టారు. తక్కువ భూమి ఉంటే ప్రభుత్వం నుంచి అందే ఆర్థిక సహాయం తీసుకోవడానికి వీలుగా ఉంటుందని భావిస్తున్నారు. అది పూర్తిగా కరెక్ట్ కాకపోవచ్చు’ అని ప్రభుత్వ అధికారి చెబుతున్నారు.