Hyderabad Metro : new corona strain భయం, 2021 కష్టాల ప్రయాణమేనా?

Hyderabad Metro : new corona strain భయం, 2021 కష్టాల ప్రయాణమేనా?

Updated On : December 28, 2020 / 3:29 PM IST

Hyderabad Metro train New Corona Strain : హైదరాబాద్‌ మెట్రో రైల్‌ (Hyderabad Metro train)ను కరోనా (Corona) కష్టాలు వెంటాడుతున్నాయి. మరో ఏడాది కష్టాల ప్రయాణం తప్పేట్టు లేదు. కొవిడ్‌ వల్ల ప్రయాణికులు సంఖ్య గణనీయంగా తగ్గింది. కొత్త కరోనా స్ట్రెయిన్‌ (New Corona Strain)తో మెట్రో రైల్‌లో ప్రయాణంచే వారి సంఖ్య మరింత తగ్గిపోయే ప్రమాదం ఉందన్న ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది.

మెట్రో రైల్‌ (Metro Rail) మూడు కారిడార్లలో అందుబాటులోకి వచ్చింది. లాక్‌డౌన్‌ (Lock Down)కు ముందు నిత్యం నాలుగు లక్షల మంది ప్రయాణించేవారు. ఈ ఏడాది మార్చి 22 నుంచి సెప్టెంబర్‌ 6 వరకు 168 రోజుల పాటు మెట్రో నడవలేదు. లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత సెప్టెంబర్‌ 7 నుంచి సేవలు పునఃప్రారంభమైనా.. ప్రయాణికుల నుంచి ఆశించిన స్పందన లేదు. మొదట్లో 20 వేల మంది ప్రయాణించేవారు.. ఆ తర్వాత ఈ సంఖ్య 30 వేలకు పెరిగి.. ఇప్పుడు లక్షకు చేరింది. ప్రయాణికులను ఆకర్షించేందుకు మెట్రో అధికారులు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లు ప్రకటించినా.. పెద్దగా స్పందన లేదు. దీంతో మెట్రో స్టేషన్లకు ఉన్న నాలుగు ప్రవేశ మార్గాల్లో రెండింటిని మూసివేశారు.

మెట్రో రైళ్లను ఎక్కువగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు (Software Employee) ఉపయోగించుకునేవారు. కరోనా వల్ల సాఫ్ట్ వేర్ ఉద్యోగులు చాలా మంది వర్క్‌ ఫ్రమ్‌ హోం చేస్తున్నారు. ఇది మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉంది. కొవిడ్‌ భయంతో అవసరం ఉంటే మినహా.. ప్రజలు బయటకు రావడంలేదు. ఎక్కువ మంది సొంత వాహనాలను వాడుతున్నారు. మెట్రో రైళ్లలో రద్దీ తగ్గడానికి ఇది కూడా కారణమైంది. మెట్రో రైళ్లను ఎప్పటికప్పుడు శానిటైజేషన్‌ చేస్తున్నప్పటికీ.. ప్రయాణికుల్లో భయం పోవడం లేదు. కరోనా వ్యాక్సిన్‌ ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చే వరకు మెట్రో (Metro) కు కష్టాలు తప్పవని భావిస్తున్నారు.