Telangana Secretariat: అందుకే కొత్త సచివాలయం కట్టారు: ఈటల రాజేందర్

Telangana Secretariat: పాత సచివాలయాన్ని కూల్చేసి కొత్త దాన్ని ఎందుకు కట్టారో చెప్పారు ఈటల రాజేందర్. తెలంగాణ కొత్త సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రారంభించిన విషయం తెలిసిందే.

Telangana Secretariat: అందుకే కొత్త సచివాలయం కట్టారు: ఈటల రాజేందర్

Etela Rajender

Updated On : April 30, 2023 / 4:08 PM IST

Telangana Secretariat: ఇతర నాయకుల ఆనవాళ్లు లేకుండా చేసేందుకే కొత్త సచివాలయాన్ని కట్టారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ వ్యక్తిగత ప్రతిష్ఠ కోసమే ప్రజల ధనంతో తెలంగాణ సచివాలయాన్ని నిర్మించారని చెప్పారు. తెలంగాణ కొత్త సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా ఈటల రాజేందర్ కరీంనగర్ లో మీడియాతో మాట్లాడుతూ… తెలంగాణలో ఎన్నికలు జరగాల్సి ఉన్న నేపథ్యంలో కనీసం వచ్చే మూడు-నాలుగు నెలల పాటు సీఎం కేసీఆర్ రోజూ సచివాలయానికి వెళ్తారా? అని నిలదీశారు. కొత్త సచివాలయంలోనైనా పాలన బాగుండాలని కోరుకుంటున్నానని చెప్పారు.

కొత్త సచివాలయ నిర్మాణం కోసం శ్రమించిన కార్మికులు అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని ఈటల రాజేందర్ అన్నారు. కేసీఆర్ పాలనలో తొమ్మిదేళ్లుగా వ్యవస్థలన్నీ అస్తవ్యస్థగా మారాయని విమర్శించారు. కాగా, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీపై కేసీఆర్ కు ఉన్న ప్రేమకు చిహ్నంగానే సచివాలయాన్ని కట్టారని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవా చేసిన విషయం తెలిసిందే.

CM KCR: అప్పుడు చాలా విధ్వంసం జరిగింది.. ఇప్పుడు “మరుగుజ్జు” మాటలు పట్టించుకోవద్దు: కేసీఆర్