Hyderabad : బాబోయ్.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు, హైదరాబాద్ కూకట్ పల్లిలో తప్పిన పెను ప్రమాదం

Hyderabad : మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది.

Hyderabad : బాబోయ్.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో చెలరేగిన మంటలు, హైదరాబాద్ కూకట్ పల్లిలో తప్పిన పెను ప్రమాదం

Hyderabad

Updated On : June 3, 2023 / 1:01 AM IST

Hyderabad Bus Fire Accident : హైదరాబాద్ కూకట్ పల్లిలో పెను ప్రమాదం తప్పింది. కూకట్ పల్లి వై జంక్షన్ సమీపంలోని హెచ్ పీ పెట్రోల్ బంక్ వద్ద ఒక్కసారిగా ఆరెంజ్ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్.. ప్రయాణికులను కిందకు దించేశాడు. బస్సు ఇంజిన్ నుంచి భారీ శబ్దంతో మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనతో పరుగులు పెట్టారు.

Also Read..Coromandel Express Accident : కోరమాండల్ రైలు ప్రమాదం.. 70మంది మృతి, 350మందికి పైగా గాయాలు, ఏపీలో హెల్ప్ లైన్ నెంబర్లు

ప్రమాదంలో బస్సు పూర్తిగా దగ్గమైంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేసింది. మంటలు భారీగా ఎగసిపడ్డాయి. ఈ మంటల్లో బస్సు పూర్తిగా కాలిపోయింది. అయితే, ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. ప్రమాదం కారణంగా బాలానగర్ నుంచి వాహనాలు నిలిచిపోవడంతో కాసేపు అక్కడ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.