పర్యాటకుల అనుమతిపై గోవా కీలక నిర్ణయం!

గోవాకు వచ్చేయండి..ఎంజాయ్ చేయండి..కానీ కొన్ని కండీషన్స్ పాటించండి..అంటోది…అక్కడి ప్రభుత్వం. ఈ మేరకు సీఎం ప్రమోద్ సావంత్ ప్రకటించారు. పర్యాటక రంగాన్ని రక్షించుకోవాలని, టూరిజం అభివృద్ధి కోసం చర్యలు తీసుకోవాలని స్వయంగా ప్రధాన నరేంద్ర మోడీ రాష్ట్రాలకు సూచించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గోవా ప్రభుత్వం పై విధంగా నిర్ణయం తీసుకుంది.
టూరిస్టులను ఎక్కువ ఆకర్షించే ప్రాంతాల్లో గోవా ఒకటి. పర్యాటక రంగంపై అధిక ఆదాయం వస్తుందనే సంగతి తెలిసిందే. కానీ..కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ ప్రకటించింది కేంద్రం. దీంతో ఎక్కడికక్కడనే జన జీవనం స్తంభించిపోయింది. దీంతో ఆర్థిక రంగం కుదేలై పోయింది. దీంతో కేంద్రం కొన్నింటికి సడలింపులు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక పరిస్థితులను మెరుగు పరుచుకొనేందుకు రాష్ట్రాలు కూడా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి.
కానీ కరోనా..వైరస్ గోవాలో తక్కువగానే ఉందని చెప్పవచ్చు. గ్రీన్ జోన్ లో కొనసాగుతోంది. పర్యాటక రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు కేంద్రంతో ముందుకు వెళుతామని, పర్యాటకులను ఆకర్షించడానికి ఈ రంగాన్ని అభివృద్ది చేయాల్సినవసరం ఉందని సీఎం సావంత్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కేంద్రం ప్రకటించిన మార్గదర్శకాల ప్రకారం..2020, మే 17 తర్వాత..గోవాలోకి పర్యాటకులను అనుమతిస్తామన్నారు.
ప్రస్తుతం రాష్ట్రాన్ని పర్యాటక కేంద్రంగా తిరిగి రూపొందించే పనిలో ఉంది…రాష్ట్ర పర్యాటక మంత్రిత్వ శాఖ. కానీ గోవా సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర, కర్నాటకలో కరోనా వైరస్ విజృంభిస్తున్న క్రమంలో ఈ రాష్ట్రాల ప్రజలకు అనుమతి ఉండదని ఆయన స్పష్టం చేశారు.
Read More:
* రేస్ కోర్సా : లాక్ డౌన్ వేళ..నడిరోడ్డుపై BJP ఎమ్మెల్యే గుర్రపుస్వారి