అందుకే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నాకు నోటీసులు ఇచ్చారు: హరీశ్ రావు

తెలంగాణ భవన్‌ వద్దకు బీఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకుంటున్నారు.

అందుకే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో నాకు నోటీసులు ఇచ్చారు: హరీశ్ రావు

Harish Rao (Image Credit To Original Source)

Updated On : January 20, 2026 / 11:11 AM IST
  • తాటాకు చప్పుళ్లకు భయపడను
  • రేవంత్‌ రెడ్డివి డైవర్షన్‌ పాలిటిక్స్‌
  • నిన్న రాత్రి నోటీసులు.. ఇవాళ విచారణ 

Harish Rao: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావుకు నోటీసులు అందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి కేటీఆర్‌తో కలిసి హరీశ్‌ రావు హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌కు చేరుకుని చర్చించారు. తెలంగాణ భవన్‌ వద్దకు బీఆర్ఎస్‌ నేతలు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు.

Also Read:  TGSRTC: టూర్‌కి, తీర్థయాత్రలకు వెళ్లాలనుకుంటున్నారా? మీలాంటి వారి కోసమే ఆర్టీసీ స్పెషల్‌ టూర్‌ ప్యాకేజ్‌లు  

అంతకుముందు కోకాపేటలో కేటీఆర్‌తో కలిసి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. తాను తాటాకు చప్పుళ్లకు భయపడబోనని అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారని, అందుకే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో తనకు సిట్‌ నుంచి నోటీసులు వచ్చాయని అన్నారు. నిన్న రాత్రి 9 గంటలకు నోటీసులు ఇచ్చి ఇవాళ ఉదయం 11 గంటలకు విచారణకు రావాలన్నారని తెలిపారు.

నోటీసులు తనకు కొత్తేం కాదని హరీశ్ రావు అన్నారు. తనకు చట్టాలపై గౌరవముందని, సిట్ విచారణకు హాజరవుతానని హరీశ్ రావు చెప్పారు. తాను ఏ తప్పూ చేయలేదు కాబట్టి భయపడనని అన్నారు. తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికల ముందు అవినీతితో పాటు రేవంత్‌ రెడ్డి బామమరిది బాగోతాన్ని బయటపెట్టినందుకే తనకు నోటీసులు ఇచ్చారని అన్నారు.