ఈ డిమాండ్ నెరవేర్చకపోతే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తాం: హరీశ్ రావు

Harish Rao: సమస్యలను పరిష్కారించకుంటే పోరాటానికి సిద్ధమవుతామన్నారు.

ఈ డిమాండ్ నెరవేర్చకపోతే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తాం: హరీశ్ రావు

HARISH RAO

కాంగ్రెస్ ప్రభుత్వంపై తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రైతుల బలవన్మరణాల పాపం కాంగ్రెస్‎దేనని చెప్పారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలోని ధరావత్ తండా గ్రామ పరిధిలోని ఎండిన పంటలను హరీశ్ రావు పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులను ఆదుకోకపోతే సెక్రటేరియట్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

రైతులను తక్షణమే ఆదుకోవాలన్నారు. రైతాంగానికి సాగు నీళ్లు అందించాలని డిమాండ్ చేశారు. రాజకీయాలు కాకుండా రైతు ప్రయోజనాలపై దృష్టి సారించాలన్నారు. కాలువలు రాకపోవటం వల్ల.. నీళ్లు లేక కొత్త బోర్లు వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పారు.

వేసిన బోర్లలో కూడా నీరు పడలేదని అప్పుల పాలయ్యామని, రైతుబంధు కూడా పడడం లేదని రైతులు అంటున్నారని హరీశ్ రావు తెలిపారు. రైతులపై ఆర్థిక భారం పడుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సాగునీరు పుష్కలంగా అందిందని, పంటలు సమృద్ధిగా పండించామని తెలిపారు.

ఆరుగాలం శ్రమించి వరి పంట సాగుచేస్తున్న అన్నదాతల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. బోనస్ కింద ఎకరానికి రూ.500 చెల్లించాలని, ఎకరానికి రూ.25 వేలు నష్టపరిహరం అందించాలన్నారు. ఆందోళనలో ఉన్న రైతుల సమస్యలను పరిష్కారించకుంటే పోరాటానికి సిద్ధమవుతామన్నారు.

ఎన్నికల వేళ మోదీ సర్కార్‌ను కలవరపెడుతున్న ప్రధాన ఇష్యూ ఇదే..