Hyderabad Rain : హైదరాబాద్లో వర్ష బీభత్సం.. ఉరుములు, ఈదురుగాలులతో కుమ్మేసిన వాన
Hyderabad Rain : భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వర్షం నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Hyderabad Rain
Hyderabad Rain : హైదరాబాద్ లో వర్షం దంచికొట్టింది. కుండపోత వానకు నగరం తడిసి ముద్దైంది. నగరంలో పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వాన బీభత్సం సృష్టించింది.
భారీ వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. వర్షం నీరు రోడ్లపై నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ జామ్ కావడంతో నరకం చూశారు. మరోవైపు ఈదురుగాలులతో పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
Also Read..Fake Currency Gang : అంతర్ రాష్ట్ర ఫేక్ కరెన్సీ ముఠా గుట్టు రట్టు.. 13 మంది అరెస్టు
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, తార్నాక, ఉప్పల్, మేడిపల్లి, బోడుప్పల్, ఫిర్జాదీగూడ, నాచారం, మల్లాపూర్, మల్కాజ్ గిరి, శేరిలింగం పల్లి, వికారాబాద్, మెదక్ లో భారీ వాన పడింది. అటు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వాన దంచి కొట్టింది. వడగళ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి.(Hyderabad Rain)
భారీ వానతో బల్దియా అధికారులు అలర్ట్ అయ్యారు. నగరవాసులకు కీలక సూచన చేశారు. ఏదైనా సాయం అవసరమైతే కంట్రోల్ రూమ్ (040 21111111 నెంబర్) కి కాల్ చేయాలన్నారు. డీఆర్ఎఫ్ సాయం కోసం 040-29555500 కాల్ చేయాలన్నారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే తమకు తెలియజేయాలని డీఆర్ఎఫ్ డైరెక్టర్ ప్రకాశ్ రెడ్డి (ఐపీఎస్) సూచించారు. మరోవైపు కింది స్థాయి సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ లోకేష్ కుమార్ ఆదేశించారు.
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో నమోదైన వర్షపాతం వివరాలు..
* అత్యధికంగా ఆర్సీపురంలో 6.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు
* గచ్చిబౌలిలో 5.6 సెంటీమీటర్లు
* గాజులరామారంలో 5.3 సెంటీమీటర్లు
* జీడిమెట్లలో 4.6 సెంటీమీటర్లు
* బి.హెచ్.ఈ.ఎల్ లో 4.2 సెంటీమీటర్లు
* లింగంపల్లిలో 3.2 సెంటీమీటర్లు
* మల్కాజిగిరిలో 2.5 సెంటీమీటర్లు
* మాదాపూర్ లో 1.8 సెంటీమీటర్లు
* అల్వాల్ లో 1.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు.(Hyderabad Rain)
ఈ వేసవిలో ఎండలు మండిపోతున్నాయి. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉక్కపోతతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఈ క్రమంలో కురిసిన భారీ వర్షంతో హైదరాబాద్ లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. చల్లని గాలులు వీస్తున్నాయి. దీంతో నగరవాసులు రిలీఫ్ అయ్యారు. వాన కురవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఉక్కపోత నుంచి కాస్త అయినా ఉపశమనం లభించిందని ఆనందిస్తున్నారు.