KTR : ఎక్కడా వ్యతిరేకత కనిపించలేదు, మళ్లీ కేసీఆరే సీఎం- కేటీఆర్ కీలక వ్యాఖ్యలు
తెలంగాణ ఏర్పడే వరకు ఫ్లోరోసిస్ సమస్యను ఎవరూ పట్టించుకోలేదు. కేసీఆర్ సీఎం అయ్యాకే ఫ్లోరోసిస్ సమస్య తీరింది. KTR

KTR On Development (Facebook)
KTR On Development : ప్రజల మూడ్ స్పష్టంగా కనిపిస్తోందని, ఒక్క చోట కూడా తమకు వ్యతిరేకత కనబడలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. మళ్లీ సీఎంగా కేసీఆర్ అయితేనే మరింత డెవలప్ మెంట్ కనిపిస్తుందని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో దేవరకొండ, ఉప్పల్ నియోజకవర్గాలకు చెందిన వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్ లో చేరారు. వారందరికి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడారు.
‘ఒకవైపు సీఎం కేసీఆర్ రికార్డులు బద్ధలు కొడుతున్నారు. కేసీఆర్ తోనే పేదలకు న్యాయం జరుగుతుందని బీల్యా నాయక్ అన్నారు. 3వేల 400కు పైగా తండాలు పంచాయతీలయ్యాయి. ఒక్క దేవరకొండలోనే 141 గ్రామ పంచాయతీలు ఏర్పడ్డాయి. తెలంగాణ ఏర్పడే వరకు ఫ్లోరోసిస్ సమస్యను ఎవరూ పట్టించుకోలేదు.
Also Read : ఆ రెండు ఎన్నికల్లో సక్సెస్.. అదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతున్న కేసీఆర్!
కేసీఆర్ సీఎం అయ్యాకే ఫ్లోరోసిస్ సమస్య తీరింది. ఈసారి దేవరకొండలో 60వేల మెజారిటీ దాటాలి. ఇప్పటివరకూ 32 నియోజకవర్గాల్లో పర్యటించా. ప్రజల మూడ్ స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కచోట కూడా వ్యతిరేకత కనబడలేదు. మళ్లీ సీఎంగా కేసీఆర్ అయితేనే మరింత అభివృద్ధి కనిపిస్తుంది’ అని కేటీఆర్ అన్నారు.