YS Sharmila : దమ్ముంటే.. ఉద్యోగాల కల్పనపై శ్వేతపత్రం ఇవ్వండి- సీఎం కేసీఆర్ కు షర్మిల సవాల్

తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు భర్తీ చేసింది కేవలం 58వేల 240 పోస్టులే అని చెప్పారు YS Sharmila

YS Sharmila : దమ్ముంటే.. ఉద్యోగాల కల్పనపై శ్వేతపత్రం ఇవ్వండి- సీఎం కేసీఆర్ కు షర్మిల సవాల్

YS Sharmila(Photo : Google)

YS Sharmila – CM KCR : వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలంగాణ సర్కార్ టార్గెట్ గా చెలరేగిపోతున్నారు. పలు అంశాల్లో సీఎం కేసీఆర్ ను విమర్శిస్తూ వస్తున్నారు. రోజూకో ఇష్యూపై సర్కార్ ను నిలదీస్తున్నారు. తాజాగా ఉద్యోగాలకు సంబంధించి సీఎం కేసీఆర్ పై విరుచుకుపడ్డారు షర్మిల. దమ్ముంటే.. ఉద్యోగాల కల్పనపై శ్వేతపత్రం ఇవ్వండి అని సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు షర్మిల.

ఉద్యోగాల భర్తీ పేరుతో 9ఏళ్లుగా కేసీఆర్ కాలయాపన చేశారని షర్మిల విమర్శించారు. ఇంటికో ఉద్యోగమని గద్దెనెక్కి నిరుద్యోగులకు తీరని అన్యాయం చేశారని వాపోయారు. లక్ష పోస్టుల భర్తీ అని మోసం, 80వేల పోస్టుల భర్తీ అని మరో ఘరానా మోసం అని ధ్వజమెత్తారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు భర్తీ చేసింది కేవలం 58వేల 240 పోస్టులే అని షర్మిల చెప్పారు.

Also Read..Telangana Politics: బీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మైండ్‌గేమ్‌.. తెరవెనుక రాజకీయంలో మూడూ మూడే!

”1.30 లక్షల పోస్టులు భర్తీ చేసినట్లు కేసీఆర్ చెబుతున్నవి పచ్చి అబద్దాలు. రెండోసారి అధికారంలో ఉండి ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేని ఘనత కేసీఆర్ ది. నోటిఫికేషన్ లే తప్ప ఒక్కరికి కూడా అపాయింట్ మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. ఎన్నికలకు ఏడాది ముందు హడావిడి చేసినా ఫలితం శూన్యం. పేపర్ లీకులతో బయటపడ్డ కేసీఆర్ విశ్వసనీయత. రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు బిస్వాల్ కమిటీ చెప్పింది. బిస్వాల్ కమిటీ రిపోర్టును తుంగలో తొక్కి, ఖాళీల వివరాలను కప్పిపెట్టారు.

Also Read..Pension Hike : భారీగా పెన్షన్ పెంపు.. ప్రభుత్వం గుడ్ న్యూస్, జీవో జారీ

ఏటా 20 వేల ఉద్యోగాలు భర్తీ చేసినా 2 లక్షల ఉద్యోగాలు దక్కేవి. పరిపాలన చేతకాక, ఉద్యోగాలు ఇవ్వలేక నిరుద్యోగులను బలి తీసుకుంటున్నారు. రూ.3,016 నిరుద్యోగ భృతి అని చెప్పి మరో మోసం. 54లక్షల మంది నిరుద్యోగులకు కేసీఆర్ సమాధానం చెప్పాలి” అని షర్మిల డిమాండ్ చేశారు.