కాంగ్రెస్ హయాంలో ట్యాంకర్లతో వ్యవసాయంచేసే దుస్థితి వచ్చింది : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

2014 కంటే ముందు పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది.. రైతులు ట్యాంకర్లతో వ్యవసాయం చేసే దుస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ హయాంలో ట్యాంకర్లతో వ్యవసాయంచేసే దుస్థితి వచ్చింది : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

Jagadish Reddy

Updated On : April 7, 2024 / 3:09 PM IST

Jagadish Reddy : ఎన్నికల సమయంలో అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తరువాత కాంగ్రెస్ పార్టీ హామీలను విస్మరించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. డిసెంబర్ 9వ తేదీన ఆరు గ్యారెంటీలను వందరోజుల్లో పూర్తి చేస్తామనిచెప్పి.. ఇప్పుడు ముఖంచాటేస్తున్నారని, లోక్ సభ ఎన్నికల వేళ ప్రజలను మరోసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ చూస్తుందని విమర్శించారు. పార్టీ మారిన వారిపై అనర్హత వేటు వేయాలని చెబుతున్న మీరు.. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నేతల చుట్టూనే ఉన్నారు.. దీన్ని ఏమనాలి అంటూ జగదీష్ రెడ్డి ప్రశ్నించారు.

Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకోవడంపై కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే 2014 కంటే ముందు పరిస్థితి రాష్ట్రంలో వచ్చిందని, ట్యాంకర్లతో వ్యవసాయం చేసే దుస్థితి ఏర్పడిందని జగదీష్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకంటే క్రికెట్ మ్యాచ్ లకే మంత్రులు ప్రాధాన్యత ఇచ్చారని విమర్శించారు. రాష్ట్రంలో అన్ని అరాచకాలు మొదలయ్యాయి.. మేము ప్రతిపక్ష నేతలపై కేసులు పెడతామని ఎప్పుడూ మాట్లాడలేదు. ప్రజలను పక్కదోవ పట్టించేందుకు కాంగ్రెస్ ఆడుతున్న దొంగాట. హైదరాబాద్ నుంచే దేశ ప్రజలను మోసం చేసేందుకు కాంగ్రెస్ సిద్ధం అవుతుందని జగదీష్ రెడ్డి విమర్శించారు.

Also Read : బీఆర్ఎస్ పార్టీకి బిగ్‌షాక్‌.. కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మ‌రో ఎమ్మెల్యే

సీఎం, మంత్రులు సోయి తెచ్చుకొని వ్యవహరించాలని జగదీష్ రెడ్డి ‘సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సభలో చేసిన వ్యాఖ్యలపై జానారెడ్డి స్పందిచాలని అన్నారు. కేసీఆర్ లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని, ప్రజా సమస్యలపై మాట్లాడితే కేసీఆర్ ను జైల్లో పెడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం ఎవరు జైల్లో పెట్టేందుకు? కేసులు పోలీసులు పెడతారా? నేతలు పెడతారా? 10ఏళ్లుగా రేవంత్ బాస్ మోడీకూడా అదే చెబుతున్నారు. భయపడేందుకు కేసీఆర్ ఏమైనా రాహుల్ గాంధీనా. కేసీఆర్ ను జైల్లో పెడితే రైతు సమస్యలు పోతాయా అంటూ సీఎం రేవంత్ వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.