తెలంగాణలో వీరి పరిస్థితి దుర్భరంగా మారుతోంది: జగదీశ్ రెడ్డి
కాంగ్రెస్, బీజేపీ రెండూ రైతు ద్రోహ పార్టీలేనని విమర్శించారు.

Guntakandla Jagadish Reddy (photo: facebook)
తెలంగాణలో రైతుల పరిస్థితి దుర్భరంగా మారుతోందని రాష్ట్ర మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ధాన్యం, పత్తి కొనుగోళ్లను ప్రభుత్వం పట్టించుకోలేదని చెప్పారు. ఇవాళ ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎక్కడా కొనుగోలు జరుగడం లేదని అన్నారు.
కాంగ్రెస్, బీజేపీ రెండూ రైతు ద్రోహ పార్టీలేనని విమర్శించారు. ఇక్కడ రైతుల గురించి సీఎం, మంత్రులు పట్టించుకోవడం మాని ఇతర రాష్ట్రాల్లో జల్సా లు చేస్తున్నారని అన్నారు. మోదీని సీఎం రేవంత్ రెడ్డి తిట్టినా రాష్ట్ర బీజేపీ నేతలు పట్టించుకోరని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య ఫ్రెండ్‌షిప్ ఇలా ఉందని ఆరోపించారు.
రైతులు రోడ్ల మీదికి రావడం మొదలైందని జగదీశ్ రెడ్డి చెప్పారు. అధికారికంగా పవర్ కమిషన్ ఎక్కడైనా నివేదిక ఇచ్చిందా అని నిలదీశారు. కమిషన్ నివేదిక ఇస్తే శాసనసభలో బయటపెట్టాలని సవాలు విసిరారు. కేసీఆర్ నిప్పులాంటి మనిషని, దమ్ముంటే ప్రభుత్వం నివేదిక బయటపెట్టాలని అన్నారు.
కేసీఆర్‌ను, తమరను జైల్లో పెట్టే ఆలోచన వస్తే ఎందుకు జాప్యం చేస్తున్నారని నిలదీశారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ కానీ, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు గానీ రావాలని సవాలు విసిరారు. పెట్టుబడి దారులు హైదరాబాద్ ను బ్లాక్ లిస్ట్ లో పెట్టె పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. వేల కోట్ల రూపాయలు దోచుకున్న వారు సంబరాలు అంటున్నారని, రాష్ట్ర ప్రజలు చీకటి రోజులు గడుపుతున్నారని తెలిపారు.
హామీలపై మాతో చర్చకు రండి: కేటీఆర్, హరీశ్ రావుకు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సవాల్