Jagga Reddy: నేను ఈడ తొడగొట్టానంటే..: జగ్గారెడ్డి వార్నింగ్‌

పోరాటంలో భాగంగానే సమష్టి నిర్ణయం మేరకు జేఏసీ ఏర్పడిందని గుర్తుచేశారు. అప్పట్లో జేఏసీ చైర్మన్‌గా కోదండరాంను పెట్టారని తెలిపారు.

Jagga Reddy: నేను ఈడ తొడగొట్టానంటే..: జగ్గారెడ్డి వార్నింగ్‌

JaggaReddy

Updated On : January 26, 2024 / 4:29 PM IST

‘నేను ఈడ తొడకొడితే.. ఆడ నీ గుండెలు అదుర్తయ్’ అంటూ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్‌కు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. తాను ఎంతో మందిని చూశానని, కేటీఆర్ ఎంతని అన్నారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం విషయంలో బీఆర్ఎస్‎ తీరుపై జగ్గారెడ్డి ఫైర్ అయ్యారు.

ఇవాళ జగ్గారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమంలో కాంగ్రెస్ పెద్దన్న పాత్ర పోషించిందని, లబ్ధి పొందింది మయాత్రం కేసీఆర్ అని జగ్గారెడ్డి చెప్పారు. పోరాటంలో భాగంగానే సమష్టి నిర్ణయం మేరకు జేఏసీ ఏర్పడిందని గుర్తుచేశారు. అప్పట్లో జేఏసీ చైర్మన్‌గా కోదండరాంను పెట్టారని తెలిపారు.

తెలంగాణ ఉద్యమంలో కోదండరాం భీష్ముడి పాత్ర పోషించారని జగ్గారెడ్డి చెప్పారు. కోదండరాంకు ఎమ్మెల్సీ ఇవ్వడంపై ఇప్పుడు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో కోదండరాం కాళ్లను మొక్కారని, ఇప్పుడు ఆయనపైనే విమర్శలు చేస్తున్నారని చెప్పారు. తొమ్మిదేళ బీఆర్ఎస్ పాలనలో కోదండరాంకు కనీసం అపాయింట్మెంట్ ఇవ్వలేదని, ఆయనను అవమానించారని అన్నారు. బీఆర్ఎస్ తొమ్మిదేళ్ల కాలంలో చేయలేని పనిని రేవంత్ రెడ్డి చేశారని, కేటీఆర్, హరీశ్‌కు సిగ్గనిపించడం లేదా? అని నిలదీశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజ్ నిర్ణయాన్ని తెలంగాణ ప్రజలు హర్షిస్తున్నారని తెలిపారు.

Perni Nani: అందుకే పవన్ కల్యాణ్ అభ్యర్థులను ప్రకటించారు.. పౌరుషం ఉంటే మరోలా చేసేవారు: పేర్ని నాని