Jithender Reddy: లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్
తనకు 2004, 2019 ఎన్నికల్లో సీట్ రాలేదని, అంతేగానీ, ప్రజలు తనను ఎప్పుడూ తిరస్కరించలేదని అన్నారు.

Jithender Reddy (Photo : Twitter)
లోక్‌సభ ఎన్నికల్లో పోటీపై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. పాలమూరు ప్రజలు తనను ఎల్లప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని చెప్పారు. తనకు 2004, 2019 ఎన్నికల్లో సీట్ రాలేదని, అంతేగానీ, ప్రజలు తనను ఎప్పుడూ తిరస్కరించలేదని అన్నారు.
ఈ సారి పోటీలో ఉంటానని బీజేపీ అధిష్ఠానాన్ని కోరానని జితేందర్ రెడ్డి చెప్పారు. పార్టీ క్రమశిక్షణ గల కార్యకర్తగా తాను బీజేపీ అధిష్ఠాన నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అన్నారు. పార్లమెంట్ ఎఫైర్స్ కమిటీ అంగీకరిస్తే తప్పకుండా పోటీలో ఉంటానని స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు తమ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మాజీ సీఎం కేసీఆర్ కమీషన్లు తీసుకున్నారని జితేందర్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మభ్యపెడుతోందని చెప్పారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడంతో గొడవలు జరుగుతున్నాయని అన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు రూ.7లక్షల కోట్ల అప్పులు చేసిందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించుకుంటేనే కేంద్రం ప్రభుత్వం నుంచి పథకాలు సజావుగా అమలవుతాయని అన్నారు.
Kesineni Nani: ఎన్నికల వేళ షాక్.. టీడీపీకి కేశినేని నాని గుడ్ బై?