KCR : అందుకే ఆ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు- బీఆర్ఎస్ నేతలపై కేసీఆర్ సీరియస్..
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, గ్రాఫ్ వేగంగా పడిపోతోందని, కాంగ్రెస్ ఇక కోలుకోలేదన్నారు కేసీఆర్.

KCR : పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో బీఆర్ఎస్ నేతలపై గులాబీ బాస్ కేసీఆర్ సీరియస్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తర్వాత బీఆర్ఎస్ నేతలే పార్టీ పనైపోయిందని ప్రచారం చేశారని మండిపడ్డారు. ఇది మంచి పద్ధతి కాదన్నారు. అలాంటి ప్రచారంతోనే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంలోకి వెళ్లి పార్టీ మారారని అన్నారు. ఇప్పటికైనా అలాంటి ప్రచారాలను ఆపాలని, తిప్పి కొట్టాలని నేతలకు సూచించారు.
ఒక్క ఓటమితో కొట్టుకుపోయే పార్టీ బీఆర్ఎస్ కాదన్నారు. ఇటు లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీ కోసం కష్టపడాలని ఆదేశించారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని, గ్రాఫ్ వేగంగా పడిపోతోందని, కాంగ్రెస్ ఇక కోలుకోలేదన్నారు కేసీఆర్. ఎమ్మెల్యేలు పార్టీ మారిన చోట్ల ఉప ఎన్నికలు రావడం ఖాయమన్నారు. ఉపఎన్నికలకు సిద్ధంగా ఉండాలని క్యాడర్ కు సూచించారు కేసీఆర్. ఉప ఎన్నికల్లో గెలుపు తమదేనని గులాబీ బాస్ ధీమా వ్యక్తం చేశారు. 100 శాతం మళ్లీ అధికారంలోకి వస్తామన్నారు.
Also Read : ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులు చేశారా? మీకో అప్‌డేట్..
ఇక, ఏడాది పొడవునా పార్టీ ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలన్నా కేసీఆర్. పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించారు.
లోక్ సభ ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ పనైపోయిందని సొంత పార్టీ నేతలే పెద్ద ఎ్తతున ప్రచారం చేయడంతోనే 10 మంది ఎమ్మెల్యేలు నైరాశ్యంతో బీఆర్ఎస్ ను వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారని పార్టీ నేతలు, కార్యకర్తలపై గులాబీ బాస్ మండిపడినట్లు తెలుస్తోంది. ఇకపై అటువంటి ప్రచారం చేయొద్దన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాలని, మెజారిటీ స్థానాలే గెలుపే లక్ష్యంగా పని చేయాలని క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు కేసీఆర్. అటు పార్టీ కమిటీలు వేయాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ కమిటీలకు మాజీ మంత్రి హరీశ్ రావు ఇంచార్జ్ గా వ్యవహరించనున్నారు.
Also Read : చంద్రబాబు.. ఇప్పటికైనా కళ్లు తెరువు.. రైతుల కష్టాలు తెలుసుకో.. : వైఎస్ జగన్
ఇక, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రాఫ్ ఇంత తొందరగా పడిపోతుందని తాను కూడా అనుకోలేదన్నారు కేసీఆర్. పడిపోయిన గ్రాఫ్ మళ్లీ లేవదన్నారు. బీఆర్ఎస్ పార్టీ మళ్లీ 100శాతం అధికారంలోకి వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. క్యాడర్ లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు కేసీఆర్. మళ్లీ కచ్చితంగా అధికారంలోకి వస్తామని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు. పార్టీ సభ్యత్వం నుంచి మొదలు పెడితే కమిటీలు వేసే వరకు పూర్తి స్థాయిలో అందరూ సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు గులాబీ బాస్.