బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారో ఎవరూ చెప్పలేరు.. బీఆర్ఎస్‌లో మాత్రం అలా కాదు: కిషన్‌ రెడ్డి

"నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవుతారు. బీజేపీలో ఎవరు అవుతారో చెప్పమనండి చూద్దాం" అని కిషన్‌ రెడ్డి అన్నారు.

బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారో ఎవరూ చెప్పలేరు.. బీఆర్ఎస్‌లో మాత్రం అలా కాదు: కిషన్‌ రెడ్డి

Kishan Reddy

Updated On : January 18, 2025 / 4:34 PM IST

బీజేపీకి, బీఆర్ఎస్‌కి చాలా తేడా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి అన్నారు. ఆయన ఇవాళ మీడియాతో చిట్‌చాట్‌లో పాల్గొన్నారు.
‘బీజేపీ అధ్యక్షుడిగా ఎవరు బాధ్యతలు స్వీకరిస్తారో ఎవరూ చెప్పలేరు. బీఆర్ఎస్‌లో మాత్రం తదుపరి అధ్యక్షుడు ఎవరు అవుతారో నేను చెబుతాను. బీఆర్ఎస్ లో ప్రెసిడెంట్ వారి డైనింగ్ టేబుల్ మీద డిసైడ్ అవుతారు.

నెక్స్ట్ బీఆర్ఎస్ ప్రెసిడెంట్ కేటీఆర్ అవుతారు. బీజేపీలో ఎవరు అవుతారో చెప్పమనండి చూద్దాం. మా పార్టీ పదవుల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు ఇస్తాం. ఇప్పుడు మా పార్టీకి వచ్చే అధ్యక్షుడు వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఉంటారు. అందుకోసం గత ఆరు నెలలుగా వర్క్ ఔట్ చేస్తున్నాం. లోకల్ బాడీ ఎన్నికల్లో అన్ని స్థానాలలో పోటీ చేస్తాం.

స్థానిక సంస్థల ఎన్నికల గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు లేదు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వచకపోవడం వలనే 15వ ఫైనాన్స్ కమిషన్ డబ్బులు రిలీజ్ కాలేదు. చట్ట ప్రకారమే డబ్బులు రిలీజ్ చేస్తాం. తెలంగాణకు ఏం తెచ్చారని అంటున్నారు. టెక్స్టైల్ పార్క్ తెచ్చాను. జహీరాబాద్ ఇండస్ట్రీల్ పార్క్ తెచ్చాను. ఆర్ఆర్ఆర్ తెచ్చాను.

కోచ్ ఫ్యాక్టరీ తెచ్చింది మేమే. పసుపు బోర్డు మేము తెస్తే ఓ మంత్రి తాను లేఖ రాస్తానే వచ్చిందని అన్నారు. నాకు వారి మాటలు వింటే నవ్వు వస్తుంది. హైదరాబాద్ మెట్రో 2 ఫేజ్ కు కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తుంది. సహాయం చేయడం మా బాధ్యత. ఢిల్లీలో కూడా దీనిపైన వర్క్ ఔట్ చేస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరాలు రాగానే చీఫ్ సెక్రటరీ కూడా నాతో మాట్లాడారు.

రీజినల్ రైల్ రింగ్ సర్వేకు మేము డబ్బులు కేటాయించాం. ఆర్ఆర్ఆర్ అలెన్మెంట్ పూర్తి ఐతే.. రీజినల్ రైల్ రింగ్ సర్వే మొదలు అవుతుంది. చిరంజీవి నాకు మిత్రుడే.. ఇప్పుడు ఉన్న సినీ నటులలో అగ్రనటుడు. ఏదైనా సమస్య వస్తే ఆయనను చాలా మంది సంప్రదిస్తారు. నేను అదే ఉద్దేశంతో పని చేస్తాను. అనేక మంది సినీనటులు బీజేపీ కోసం పని చేశారు” అని తెలిపారు.

స్థానికులు ఆవేదన వ్యక్తం చేయడంతో కుత్బుల్లాపూర్ రెవెన్యూ అధికారులపై హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ ఆగ్రహం