అయోధ్య రామమందిరానికి ఎవరూ నిధులు ఇవ్వొద్దు

Korutla MLA Vidyasagar Controversial comments : జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామమందిరం పేరుతో బీజేపీ నేతలు బిచ్చమెత్తుకుంటున్నారని విమర్శించారు. అయోధ్యలో నిర్మాణం అవుతున్న రామాలయానికి .. ఎవరూ చందాలు ఇవ్వొదన్నారు. ఉత్తరప్రదేశ్‌లో ఉన్న రాముడు మనకెందుకు.. మన గ్రామాల్లో మనకూ రాముడు ఉన్నాడంటూ.. హాట్ కామెంట్స్ చేశారు. తామూ రాముని భక్తులమేనని.. బొట్టు పెట్టుకుంటేనే రాముని భక్తులం అవుతామా అంటూ ప్రశ్నించారు.
అయోధ్య రామమందిరానికి ఎవరూ నిధులు ఇవ్వొద్దన్న ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు వ్యాఖ్యలపై .. బీజేపీ నేతలు భగ్గుమన్నారు. మెట్‌పల్లిలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు కాన్వాయ్‌ని అడ్డుకునేందుకు బీజేపీ నేతలు ప్రయత్నించారు. దీంతో టీఆర్ఎస్-బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం పెరగడంతో పరస్పరం దాడులకు దిగారు.
టీఆర్ఎస్-బీజేపీ నేతల గొడవతో మెట్‌పల్లిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరు వర్గాలను అదుపుచేసేందుకు పోలీసులు ప్రయత్నించినా ఎవరూ వెనక్కు తగ్గలేదు. ఆందోళనకారులను అడ్డుకునే సమయంలో కొందరు పోలీసులకు గాయాలయ్యాయి.