KTR : ఆ చట్టం అమలైతే బీసీలకు రిజర్వేన్లు దక్కవు- కేటీఆర్

కోర్టులు అంగీకరించకుంటే అవసరమైతే రాజ్యాంగ సవరణ కోసం కేంద్రానికి పోదాం.

KTR : ఆ చట్టం అమలైతే బీసీలకు రిజర్వేన్లు దక్కవు- కేటీఆర్

KTR

Updated On : December 19, 2024 / 4:29 PM IST

KTR : మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. చిట్ చాట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ కు దమ్ముంటే ఫార్ములా-ఈ తోపాటు ప్రభుత్వం చేస్తున్న స్కాములపై అసెంబ్లీలో చర్చ పెట్టాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి అసెంబ్లీలో చర్చకు పెట్టే దమ్ము లేదన్నారు. మీ ఆరోపణలపై సభలో వివరాలు ఇవ్వండి, ప్రజల ముందు నిజాలు ఉంచండి అని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీలో చర్చ పెడితే ఎవరు ఏంటో ప్రజలే నిర్ణయించుకుంటారని చెప్పారు. రేవంత్ రెడ్డి లీకులిచ్చి రాజకీయ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఫార్ములా ఈ, ఇతర స్కామ్ లంటూ అసత్యాలను ప్రచారం చేసే కన్నా సభలో చర్చ పెడితే నిజాలు తెలుస్తాయని హితవు పలికారు.

‘చర్చ నాలుగు గోడల మధ్య కాదు దమ్ముంటే అసెంబ్లీలో చర్చ పెట్టమని డిమాండ్ చేస్తున్నాం. లీకులే తప్ప నిజాలు అధికారికంగా చెప్పే దమ్ములేదు సీఎంకు లేదు. ఈ ఫార్ములా రేసులో విషయమే లేనప్పుడు ముందే నేను కోర్టుకెళ్లి ముందస్తు బెయిల్ అడగాల్సిన అవసరం లేదు. ప్రభుత్వ ఆరోపణలు పరిశీలిస్తే ఏ జడ్జి అయినా వెంటనే కేసు కొట్టేస్తారనే నమక్మముంది. అధికారికంగా చెప్పే దమ్ములేక క్యాబినెట్ లో నాలుగు గంటల చర్చ అంటూ వార్తలు రాపిస్తున్నారు. క్యాబినెట్ అంటే గాసిప్ బ్యాచ్ లెక్క తయారైంది.

నిజాలు చెప్పే దమ్ము లేఖ సీఎస్ తో నోటీసులు, అనుమతులు అంటూ లీకులిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్ధానిక సంస్ధల చట్టాల సవరణలను వ్యతిరేకిస్తున్నాం. ఈ చట్ట సవరణ వలన బీసీలకు పూర్తి అన్యాయం జరుగుతుంది. బీసీలకు ఇచ్చిన 42 శాతం హమీ గంగలో కలిసినట్టే అవుతుంది. 42 శాతం రిజర్వేషన్లను పక్కన పెట్టేలా ప్రత్యేక బీసీ కమిషన్ సిఫార్సులు, ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలి అంటూ కొత్త మెలికలు పెడుతుంది. ఈ అంశంలో అన్ని పార్టీల మద్దతున్న నేపథ్యంలో ఈ చట్ట సవరణలోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అని నిబంధనలు పెట్టండి. చట్టం చేయండి.

కోర్టులు అంగీకరించకుంటే అవసరమైతే రాజ్యాంగ సవరణ కోసం కేంద్రానికి పోదాం. బీజేపీ, కాంగ్రెస్ కలిసి పార్లమెంట్ లో రాజ్యాంగ సవరణ చేయొచ్చు. బీసీలను మోసం చేసేందుకే ఈ సవరణలు. కాంగ్రెస్ ప్రవేశ పెట్టిన స్ధానిక సంస్ధల చట్టాల సవరణలను వ్యతిరేకిస్తున్నాం. ఈ మేరకు నేరుగా చట్టంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలని సవరణలు కోరాం. ఈ అంశంలో సభలో ఓటింగ్/ డివిజన్ అడుగుతాం. ఒకవేళ ఈ చట్టం అమలైతే బీసీలకు రిజర్వేన్లు దక్కవు” అని కేటీఆర్ అన్నారు.

Also Read : టాలీవుడ్‌‌ని రేవంత్ సర్కార్ టార్గెట్ చేసిందా? కారణం అదేనా?