సంక్రాంతితో వారి భ్రాంతి కూడా తొలగాలి : సోషల్ మీడియా వింగ్ కు కేటీఆర్ దిశానిర్దేశం

టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ తో మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. మున్సిపల్ ఎన్నికలపై వారికి దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియా ద్వారా ప్రచారం పెంచాలన్నారు. టీఆర్ఎస్ అంటే తిరుగు లేని రాజకీయ శక్తి అని కేటీఆర్ అన్నారు. పండగ పూట వినూత్న ప్రచారం చేయాలన్నారు. తెలంగాణ మున్సిపాలిటీలు దేశానికే ఆదర్శమని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. సోషల్ మీడియాలో ఏ పార్టీకి లేనంత మంది ఫాలోవర్లు టీఆర్ఎస్ కు ఉన్నారని కేటీఆర్ చెప్పారు.
టీఆర్ఎస్ సోషల్ మీడియాలో పెయిడ్ వర్కర్లు లేరని కేటీఆర్ తెలిపారు. మున్సిపోల్స్ ప్రచారానికి సోషల్ మీడియాను వేదికగా మలుచుకోవాలని కేటీఆర్ చెప్పారు. విపక్షాల ఆరోపణలను, అసత్య ప్రచారాలను తిప్పికొట్టాలన్నారు. సబ్జెక్ట్ పరంగా విమర్శలు చేయండి.. వ్యక్తిగతంగా వద్దని పార్టీ శ్రేణులకు కేటీఆర్ సూచించారు. మున్సిపల్ ఎన్నికలకు సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లను నియమించారు కేటీఆర్. క్రిషాంక్, పాటిమీది జగన్, సతీష్, దినేష్ లను కో-ఆర్డినేటర్లుగా అపాయింట్ చేశారు. ఈ నలుగురి సారధ్యంలో ముందుకెళ్దామన్నారు కేటీఆర్.
* టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ తో కేటీఆర్ భేటీ
* మున్సిపల్ ఎన్నికలపై దిశానిర్దేశం
* సోషల్ మీడియా ద్వారా ప్రచారం పెంచాలని ఆదేశం
* టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ లో పెయిడ్ వర్కర్లు లేరు
* టీఆర్ఎస్ కు చిత్తశుద్ధితో పని చేసే కార్యకర్తలు ఉన్నారు
* అభ్యర్థుల విజయమే లక్ష్యంగా పని చేయాలి
* ఒక టీవీ, ఒక పత్రిక చూసి వార్త అనుకునే కాలం పోయింది
* టీఆర్ఎస్ కు మొదటి నుంచీ సోషల్ మీడియా అండగా నిలిచింది
* మున్సిపల్ ఎన్నికలకు సోషల్ మీడియా కో-ఆర్డినేటర్లుగా క్రిషాంక్, పాటిమీది జగన్, సతీష్, దినేష్ నియాకమం
* సీఎం కేసీఆర్ కూడా ప్రతిరోజూ సోషల్ మీడియా చూస్తారు
* పథకాలు, ఎన్నికలపై ప్రజల నాడిని పరిశీలిస్తారు
* వినూత్న రీతుల్లో ప్రచారం చేయడంపై ఆలోచించాలి
* బీజేపీకి అభ్యర్థులు కూడా కరవయ్యారు
* ప్రతిపక్షాల ఆరోపణలు, అసత్య ప్రచారాలు తిప్పికొట్టండి
* కొత్త పంచాయతీ చట్టం వచ్చాక పల్లెల్లో అద్భుత ప్రగతి కనిపిస్తోంది
* విద్యుత్, సాగునీటి రంగంలో అభివృద్ధిలో దూసుకుపోతున్నాం
* కేసీఆర్ ముగ్గులు, కేసీఆర్ పతంగులతో ప్రతీ గడపకీ ప్రచారం చేయాలి
* మకర సంక్రాంతితో ప్రతిపక్షాల భ్రాంతి కూడా తొలగాలి
* టీఆర్ఎస్ కు 65లక్షల మంది సభ్యత్వం ఉంది
* హుజూర్ నగర్ లో ఇండిపెండెంట్ అభ్యర్థికి వచ్చిన ఓట్లు కూడా బీజేపీకి రాలేదు
* మనం మోడీకి భయపడం.. రాహుల్ కూ భయపడం