నాపై కోపంతో రేవంత్ రెడ్డి వీటిని రద్దు చేశారు: కేటీఆర్
రేవంత్ ఇలా చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా అని కేటీఆర్ ప్రశ్నించారు.

BRS Working President KTR
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై కోపంతో ఫార్ములా వన్ రేసులను రద్దు చేశారని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రముఖ సంస్థలు ఈ నిర్ణయాన్ని తప్పుబట్టాయని చెప్పారు. రేవంత్ నిర్ణయంతో అంతర్జాతీయంగా పరువు పోయిందని తెలిపారు.
రేవంత్ ఇలా చేస్తే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా అని కేటీఆర్ ప్రశ్నించారు. కార్ రేసింగ్ ఎప్పటినుంచో మొదలైన క్రీడ అని అన్నారు. ఫార్ములా వన్ 1946లో ప్రారంభం అయిందని తెలిపారు. ఈ రేస్ కోసం ప్రముఖ దేశాలు పోటీ పడతాయని గుర్తుచేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఫార్ములా వన్ రేసింగ్ కోసం 483 ఎకరాల భూ సేకరణకు అప్పటి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ రావాల్సిన ఎఫ్1 యూపీకి వెళ్లిందని తెలిపారు. అక్కడ ఎఫ్1 రేస్ కోసం 1100 కోట్ల రూపాయలు వెచ్చించారని చెప్పారు.
కామన్ వెల్త్ గేమ్స్ నిర్వహణ కోసం ఢిల్లీలో 70,608 కోట్ల రూపాయలు వెచ్చించారని కేటీఆర్ తెలిపారు. ప్రతిపాదనల కంటే 114 రేట్లు ఎక్కువ వెచ్చించారని అన్నారు. ఆఫ్రో, ఆసియన్ గేమ్స్ కోసం బాబు ప్రభుత్వం వంద కోట్ల రూపాయలకు పైగా వెచ్చించిందని చెప్పారు.
లండన్, మొనాకో, అమెరికా వంటి దేశాల్లో ఈ పోటీలు ప్రస్తుతం జరుగుతున్నాయని కేటీఆర్ అన్నారు. సియోల్, జోహెన్స్ బర్గ్ వంటి సిటీలతో పొట్లాడి హైదరాబాద్ లో పోటీలు నిర్వహించామని చెప్పారు. ఎలక్ట్రిక్ వాహనాలపై అవగాహన కోసం ఇక్కడ ఈ రేస్ నిర్వహించామని అన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగిందని తెలిపారు.
చంద్రబాబు సమక్షంలో పవన్ కల్యాణ్, వంగలపూడి అనిత కీలక భేటీ