మేం ఆశించిన ఫలితం రాలేదు: కేటీఆర్

KTR: దుబ్బాక ఉప ఎన్నికపై టీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. తమ పార్టీ ఓటమి గురించి మాట్లాడుతూ.. పనితీరులో ఎలాంటి మార్పు ఉండదని వెల్లడించారు.
ఏడాది క్రిందట సూర్యాపేట హుజూర్ నగర్ ఉపఎన్నికలో బ్రహ్మాండమైన విజయం నమోదైంది. అప్పుడు కూడా విజయాలకు పొంగిపోము. అపజయాలకు కుంగిపోము అని చెప్తూనే ఉన్నాం. ఈ ఉప ఎన్నికలో పార్టీ గెలుపు కోసం పార్టీ కార్యకర్తలకు నాయకులకు, శాసన సభ్యులకు, మంత్రి వర్యులకు, పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ఈ ఫలితాలు ఆశించినట్లుగా రాలేదు. మేం అప్రమత్తంగా ఉండటానికి ఇది పనికి వస్తుందని అనుకుంటున్నాం. ఫలితాలు ఆశించినట్లు ఎందుకు రాలేదనే విషయం చర్చిస్తాం. ప్రభుత్వపరంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా మా పని మేము పూర్తి చేస్తాం. తీర్పును పూర్తిగా సమీక్షించుకుని ముందుకు వెళతాం. ఎన్నికల్లో 62వేలకు పైగా ఓటు వేసిన అభ్యర్థులకు ధన్యవాదాలు.