Minister KTR : పాతబస్తీ అభివృద్ధికి రూ.14 వేల కోట్లు విడుదల చేశాం
పాతబస్తీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 14 వేల కోట్లు విడుదల చేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు పాతబస్తీకి ఇప్పటివరకు కేటాయించిన నిధుల వివరాలను వెల్లడించారు.

Minister Ktr
Minister KTR : పాతబస్తీ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం 14 వేల కోట్లు విడుదల చేసిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. సోమవారం అసెంబ్లీలో మాట్లాడిన కేటీఆర్ ఈ మేరకు పాతబస్తీకి ఇప్పటివరకు కేటాయించిన నిధుల వివరాలను వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కేవలం 3 వేల కోట్లు మాత్రమే విడుదల చేసిందన్నారు. హైకోర్టు, సాలార్జంగ్ మ్యూజియం లాంటివి ఓల్డ్ సిటీలోనే ఉన్నాయన్నారు. పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో బ్రిడ్జ్‌ల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఏ పార్టీ ఎమ్మెల్యే అని కాకుండా ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగేలా చూస్తామని చెప్పారు.
Read More : CM Jagan : ప్రతి మహిళ ఫోన్‌లో దిశ యాప్ ఉండాలి
త్వరలో జీహెచ్ఎంసీ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. ఇక నగరంలోని చెరువులను గొలుసుకట్టు మాదిరి అభివృద్ధి చేస్తామని వివరించారు. పాతబస్తీలో రోడ్ వైడెనింగ్ పనులు చేపడుతున్నామని మంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం 400 కోట్లను కేటాయించామన్నారు. పాతబస్తీకీ మెట్రో విస్తరించడం సరైందే, ఇప్పటికే ఆలస్యమైందన్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో పాతబస్తీకి మెట్రోరైలు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. డ్రైనేజ్, చెరువుల పునరుద్ధరణ కోసం రూ.3800 కోట్లు విడుదల చేసినట్లు వెల్లడించారు.