Navdeep : డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు బిగ్ రిలీఫ్

టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ కేసులో మరోసారి టాలీవుడ్ హీరో నవదీప్ పేరు తెరపైకి వచ్చింది. Navdeep - Madhapur Drugs Case

Navdeep : డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు బిగ్ రిలీఫ్

Big Relief For Hero Navdeep In Drugs Case

Navdeep – Madhapur Drugs Case : మాదాపూర్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్ కు బిగ్ రిలీఫ్ లభించింది. తెలంగాణ హైకోర్టులో నవదీప్ కు ఊరట దక్కింది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న హీరో నవదీప్ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో నవదీప్ ను అరెస్ట్ చేయడానికి వీల్లేదని పోలీసులను ఆదేశించింది కోర్టు.

టాలీవుడ్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. డ్రగ్స్ కేసులో మరోసారి టాలీవుడ్ హీరో నవదీప్ పేరు తెరపైకి వచ్చింది. హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసుకి సంబంధించి హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సంచలన, షాకింగ్ విషయాలు వెల్లడించారు. ఈ కేసులో టాలీవుడ్ లో ఉన్న వారు సైతం బయటకు వస్తున్నారని ఆయన చెప్పారు. ఈ కేసులో టాలీవుడ్ హీరో నవదీప్ కూడా ఉన్నట్లు తెలిపారాయన. నవదీప్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. మాదాపూర్‌ డ్రగ్స్ కేసులో ఐదుగురిని అరెస్ట్ చేయడంతో పాటు డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకున్నామని, నిందితుల ఫోన్లను సీజ్‌ చేశామని సీపీ సీవీ ఆనంద్ వివరించారు.

Also Read..Navdeep : డ్రగ్స్ కేసులో నవదీప్..! తాను కాదంటున్న టాలీవుడ్ హీరో నవదీప్

ఈ కేసులో నవదీప్ స్నేహితుడు రాంచంద్ ను అరెస్ట్ చేశామని, అతడు ఇచ్చిన సమాచారం ప్రకారం కన్జ్యూమర్ గా నవదీప్ ఉన్నట్టు గుర్తించామని సీపీ సీవీ ఆనంద్ పేర్కొన్నారు.

కాగా.. డ్రగ్స్ కేసులో తన పేరు రావడంపై నవదీప్ ట్విట్టర్ లో స్పందించారు. పోలీసులు చెబుతున్న నవదీప్ తాను కాదన్నారు. డ్రగ్స్ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. నేను ఎక్కడికీ పారిపోలేదు, ఇక్కడే ఉన్నాను అన్న నవదీప్.. దీనిపై క్లారిటీ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ఇంతలో నవదీప్ హైకోర్టుని ఆశ్రయించడం, కోర్టులో నవదీప్ కు ఊరట లభించడం వంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి.

Also Read..Baby Movie : బేబీ సినిమాపై సీపీ తీవ్ర ఆగ్రహం.. సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సీవీ ఆనంద్, ఇక ప్రతి సినిమాపైనా నిఘా