COVID 19 In Telangana : తెలంగాణలో కరోనా, 24 గంటల్లో 3,527 కేసులు, 19 మంది మృతి
తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తోంది. క్రమ క్రమంగా పాజిటివ్ కేసులు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం 3 వేల కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 97 వేల 236 నమూనాలు పరీక్షించగా.. 3 వేల 527 కేసులు నమోదయ్యాయి.

Tg Covid
Telangana Covid : తెలంగాణలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టినట్లే కనిపిస్తోంది. క్రమ క్రమంగా పాజిటివ్ కేసులు తగ్గిపోతున్నాయి. ప్రస్తుతం 3 వేల కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 97 వేల 236 నమూనాలు పరీక్షించగా.. 3 వేల 527 కేసులు నమోదయ్యాయి. మరో 19 మంది కరోనాతో చనిపోయారు. 3 వేల 982 మంది కోలుకున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 519 కొత్త కేసులు రాగా.. రంగారెడ్డి జిల్లాలో 207, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలో 188, ఖమ్మం జిల్లాలో 215 చొప్పున నమోదయ్యాయి. మొత్త మరణాల సంఖ్య 3 వేల 226కి చేరుకోగా…5 లక్షల 30 వేల 025 మంది కోలుకున్నారు.
ఏ జిల్లాలో ఎన్ని కేసులు :
ఆదిలాబాద్ 18. భద్రాద్రి కొత్తగూడెం 154. జీహెచ్ఎంసీ 519. జగిత్యాల 55. జనగామ 31. జయశంకర్ భూపాలపల్లి 48. జోగులాంబ గద్వాల 54. కామారెడ్డి 20. కరీంనగర్ 178. ఖమ్మం 215. కొమరం భీం ఆసిఫాబాద్ 23. మహబూబ్ నగర్ 124. మహబూబాబాద్ 119. మంచిర్యాల 88. మెదక్ 40.
మేడ్చల్ మల్కాజ్ గిరి 188. ములుగు 46. నాగర్ కర్నూలు 81. నల్గొండ 218. నారాయణపేట్ 26. నిర్మల్ 15. నిజామాబాద్ 47. పెద్దపల్లి 144. రాజన్న సిరిసిల్ల 78. రంగారెడ్డి 207. సంగారెడ్డి 75. సిద్ధిపేట 115. సూర్యాపేట 152. వికారాబాద్ 83. వనపర్తి 95. వరంగల్ రూరల్ 96. వరంగల్ అర్బన్ 130. యాదాద్రి భువనగిరి 45. మొత్తం 3527.
Read More : 16 Hour Bath : బాత్ రూంలో 16 గంటల స్నానం, ఇలా అయిపోయాను..ఏం చేయాలి ?